నీ ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందట.. నీ నట్లు బిగిస్తారు ఉండు: విజయసాయిరెడ్డిపై అయ్యన్న సెటైర్లు

Siva Kodati |  
Published : Jun 22, 2021, 02:49 PM IST
నీ ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందట.. నీ నట్లు బిగిస్తారు ఉండు: విజయసాయిరెడ్డిపై అయ్యన్న సెటైర్లు

సారాంశం

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తొలుత, మీడియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తొలుత, మీడియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ పదవిని విజయసాయిరెడ్డికి ఇప్పించేందుకు ప్రయత్నించాడన్నది ఆ కథనం సారాంశం.

 

 

ఈ నేపథ్యంలో, అయ్యన్న స్పందిస్తూ.... "ఏమయ్యా కే2, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ లాంటి ప్లాన్లు ఇప్పుడమేమీ వెయ్యడం లేదా?" అంటూ సెటైర్లు వేశారు. "లేకపోతే ఇంతకుమించి పెద్ద ప్లాన్లు వేస్తున్నావా? నువ్వు వేస్తున్న ఒక పెద్ద ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందట... నీ నట్లు బిగిస్తారు ఉండు!" అంటూ వ్యాఖ్యానించారు.

అటు, సీఎం జగన్ పైనా అయ్యన్న సెటైర్ వేశారు. "తెలుగు భాషను వింతవింతగా పలుకుతూ, వినూత్న కిలికి భాషగా మార్చిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రెడ్డి గారూ, వితంతవులు కాదు, వితంతువులు అనాలి" అని పేర్కొన్నారు. "విధ్వంస పాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు... రాజ్యాంగాన్ని అపహాస్యం చేశావు. చిట్టచివరికి తెలుగు భాషను కూడా గుచ్చిగుచ్చి చంపేస్తున్నావు. నీకు దండం పెడతా... కనీసం తెలుగుభాషనైనా ఖూనీ చేయకుండా వదిలేయ్" అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?