ఇండస్ట్రీకి కింగ్‌వి కాదు.. హీరోవే, మూసుకుని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

Siva Kodati |  
Published : May 28, 2020, 06:25 PM ISTUpdated : May 28, 2020, 06:28 PM IST
ఇండస్ట్రీకి కింగ్‌వి కాదు.. హీరోవే, మూసుకుని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

సారాంశం

చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశాన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ  వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు ఫైరయ్యారు.

చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశాన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ  వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు ఫైరయ్యారు.

బాలయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.

బాలకృష్ణ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఆయన మాట్లాడింది చాలా తప్పని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య కేవలం పరిశ్రమనే కాదని.. తెలంగాణ ప్రభుత్వాన్నీ కూడా అవమానించారని ఆయన అన్నారు.

భూములు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు బాధాకరమని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుందని నాగబాబు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారని నాగబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ ఏం మాట్లాడిన నోరు మూసుకుని కూర్చోమని.. ఇండస్ట్రీకి బాలయ్య కింగ్ కాదని.. కేవలం హీరోనే అని ఆయన గుర్తుచేశారు.

లాక్‌డౌన్ సందర్భంగా చితికిపోతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ కదిలివచ్చిందని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో షూటింగ్‌లు ఎలా ప్రారంభించాలా అన్న దానిపై చిరంజీవి నివాసంలో పరిశ్రమ పెద్దలు చర్చలు జరిపారని నాగబాబు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్