రఘురామ కృష్ణమ రాజుకు 18 రకాల వైద్య పరీక్షలు: ఆ తర్వాత రమేష్ ఆస్పత్రికి...

By telugu team  |  First Published May 16, 2021, 8:35 AM IST

ఏపీ సీఐడి చేతుల్లో అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు గుంటూరు జిజీహెచ్ లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణమ రాజుకు 18 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.


అమరావతి: అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు గుంటూరులోని జీజీహెచ్ లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆయనకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జీజీహెచ్ కు చెందిన ప్రభావతి, సతీష్ లతో పాటు మరో వైద్యుడి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కోర్టు సూచించిన ఇతర పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. 

తనను పోలీసులు కొట్టారంటూ, తనకు గాయాలయ్యాయంటూ రఘురామకృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశాడు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను సమర్పించడానికి సెషన్స్ కోర్టు రెండు కమిటీలను వేసింది. జీజీహెచ్ కు చెందిన ముగ్గురు వైద్యులతో ఒక కమిటీ కాగా, ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన కమిటీ మరోటి.

Latest Videos

Also Read: సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణమ రాజు స్పెషల్ లీవ్ పిటిషన్

ఆ నేపథ్యంలో జీజీహెచ్ లో రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆయనను గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ రెండు కమిటీలు కూడా కోర్టుకు నివేదికలు సమర్పిస్తాయి. జిజిహెచ్ లో వైద్య పరీక్షలు జరుగుతున్న తీరును వీడియోలో చిత్రీకరిస్తున్నారు. 

కాగా, రఘురామకృష్ణమ రాజు ఆరోగ్యంపై నివేదిక సమర్పించడానికి హైకోర్టు మరో కమిటీ వేసింది. మొత్తం మూడు కమిటీలు రఘురామకృష్ణమ రాజు ఆరోగ్యంపై నివేదికలు సమర్పించనున్నాయి. ఈ నివేదికల ఆధారంగా కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 

Also Read: మే 28 వరకు రఘురామకు రిమాండ్.. ఆరోగ్యం కుదటపడ్డాకే జైలుకి : సీఐడీ కోర్ట్ ఆదేశాలు

కాగా, రఘురామకృష్ణమ రాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రేపు సోమవారం విచారణకు రానుంది. రఘురామకృష్ణమ రాజుకు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్మ దాఖలు చేశారు.  రఘురామకృష్ణమ రాజును ఏపీ సిఐడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

click me!