
ప్రొఫెసర్ల వేధింపులు భరించలేక చిత్తూరు జిల్లా పీలేరులో పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరవకముందే.. మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది..
విజయవాడ కొత్తపేటకు చెందిన హిమజ.. నగరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలు సరిగా రాయలేదనే మనస్తాపంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.