అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

Published : Jan 20, 2019, 04:19 PM IST
అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

సారాంశం

పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.


కడప: పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం నాడు కడప జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తనను మంత్రి ఆదినారాయణరెడ్డి అవమానపరుస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ నెల 22వ తేదీన చంద్రబాబునాయుడును కలిసి  తన బాధను వివరించనున్నట్టు మల్లిఖార్జున్ రెడ్డి చెప్పారు.పార్టీకి తనను దూరం చేసేందుకే ఆదినారాయణరెడ్డి ఇవాల సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇందులో భాగంగానే ఈ సమావేశానికి తనకు ఆహ్వానం కూడ పంపలేదని ఆయన చెప్పారు.

తాను పార్టీ మారుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లిఖార్జున్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు.తనపై అనవసరమైన అబాండాలు వేస్తున్నారని మేడా మల్లిఖార్జున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు మేడా మల్లిఖార్జున్ రెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్