ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ప్రమాదం: ఎల్జీ ఫ్యాక్టరీ జీఎం

Published : May 07, 2020, 02:29 PM ISTUpdated : May 07, 2020, 04:55 PM IST
ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ప్రమాదం: ఎల్జీ ఫ్యాక్టరీ జీఎం

సారాంశం

ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ జీఎం తెలిపారు. 

విశాఖపట్టణం: ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ జీఎం తెలిపారు. 

గురువారం నాడు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్టరీలో ప్రమాదంపై మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను ఫ్యాక్టరీ వద్దకు వచ్చినట్టుగా చెప్పారు. అయితే ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి గ్యాస్ భారీగా లీక్ కావడంతో తాము ఫ్యాక్టరీలోకి వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు.

also read:విశాఖలో గ్యాస్ లీక్: కేజీహెచ్‌లో బాధితులకు జగన్ పరామర్శ

అయితే ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని జీఎం చెప్పారు. స్కిల్డ్ వర్కర్లు  తమ కంపెనీలో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.సాధారణ పరిస్థితులు వచ్చేవరకు గ్రామస్తులు వచ్చే వరకు ఇటువైపు రాకూడదని ఆయన సూచించారు.

గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు పూర్తయ్యాకే సమాచారాన్ని ఇస్తామన్నారు.

గ్యాస్ లీకేజీ కారణంగా  విశాఖలో 10 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గరయ్యారు. అస్వస్థతకు గురైన వారిని పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు