రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ షోరూమ్‌లో చెలరేగిన మంటలు

Published : Aug 29, 2022, 10:22 AM IST
రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ షోరూమ్‌లో చెలరేగిన మంటలు

సారాంశం

రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై ఉన్న సన్ ఎలక్ట్రిక్ షోరూ‌మ్‌లో మంటల చెలరేగాయి. 

రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై ఉన్న సన్ ఎలక్ట్రిక్ షోరూ‌మ్‌లో మంటల చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుంటంతో.. షోరూమ్ పై అంతస్తుల్లో  నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళన చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది   వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. షోరూమ్ పై అంతస్తుల్లో ఉన్నవారిని క్షేమంగా బయటకు తీసుకొస్తున్నారు. 

షోరూమ్‌లో భారీగా మంటలు ఎగసిపడుతుండటం, పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక, మంటలు చెలరేగిన సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేరని చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే భారీగా ఆస్థి నష్టం చోటుచేసుకునే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu