తిరుపతిలో విషాదం.. వాగు ఉదృతికి కొట్టుకుపోయిన కారు.. యువతి మృతి, నలుగురిని కాపాడిన స్థానికులు..

By Bukka Sumabala  |  First Published Aug 29, 2022, 8:57 AM IST

భారీ వర్షాలకు పొంగుతున్న వాగును దాటబోయిన కారు నీటి ఉదృతికి కొట్టుకుపోయింది. దీంతో ఓ యువతి మృతి చెందగా నలుగురిని గ్రామస్తులు, పోలీసులు కాపాడారు.


తిరుపతి : అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో శనివారం రాత్రి వాగులో కారు ఇరుక్కుపోవడంతో 22 ఏళ్ల యువతి కొట్టుకుపోయింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ తరువాత కారులోని ఆ యువతి కుటుంబ సభ్యులు నలుగురిని రక్షించారు. ఈ ఘటన పీటీఎం మండల పరిధిలోని సంపతికోట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి కొత్తకోట మండలం తోకలపల్లికి చెందిన బాలిక మౌనిక (22) ఇంజనీరింగ్ విద్యార్థిని. ఆమె తండ్రి రమణ (45), తల్లి ఉమాదేవి (37), మామ శ్రీనివాసులు (39) కారు డ్రైవర్‌ లను గ్రామస్థులు, స్థానిక పోలీసులు రక్షించారు. శనివారం ఉదయం ఉమాదేవికి చికిత్స నిమిత్తం బెంగుళూరు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Latest Videos

undefined

వివాహేతర సంబంధం : భర్త హత్యను ప్రోత్సహించిన భార్య.. పారిపోతుండగా అరెస్ట్...

శని, ఆదివారాల్లో రాత్రి 12:30-12:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కారు పొంగిపొర్లుతున్న ప్రవాహాన్ని దాటుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. "మేము సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, నీటి వేగానికి.. అందులో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తాళ్లను అందించి.. కొట్టుకుపోకుండా పట్టుకున్నారు. అప్పటికే కారు కొట్టుకుపోయింది, అది కాస్త దూరంలో ఉన్న సిమెంట్ స్తంభంపై ఇరుక్కుపోయింది" అని పోలీసులు తెలిపారు.

"రెస్క్యూ టీమ్‌లు, స్థానికులు నలుగురిని బయటకు తీశారు. అయితే స్థానికులు వేసిన తాళ్లను మౌనిక అందుకోలేకపోయింది. దీంతో ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది ’అని పోలీసులు తెలిపారు. అయితే కారు నీటిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన కొందరు సమీప గ్రామస్తులను అలర్ట్ చేశారు. దీంతో వారు సకాలంలో జోక్యం చేసుకోవడంతో.. నలుగురు ప్రాణాలు కాపాడారు. 

గత రెండు రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాగు పొంగి ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు  ప్రమాదాల నివారణకు గానూ ఎలాంటి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయలేదు, ట్రాఫిక్‌ను మళ్లించలేదని స్థానికులు చెబుతున్నారు. 

click me!