వైసీపీలో భారీగా పదవుల మార్పులు, చేర్పులు.. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం..

By team teluguFirst Published Nov 24, 2022, 8:20 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో భారీగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించడంతో పాటు, రీజినల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల్లోనూ మార్పులు చేశారు. 

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మేరకే ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల ముందు పార్టీ ఆధ్వర్వంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టీపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఆయన పార్టీ అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. జిల్లా అధ్యక్షులు సరిగ్గా పని చేయాలని, లేదా కొత్త వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. అందులో భాగంగానే తాజా మార్పులు వచ్చాయని తెలుస్తోంది. 

ప్రజాస్వామ్య మనుగడకు ఏపీలోని వైకాపా, కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ల‌ను గద్దె దించాల్సిందే..: సీపీఐ నారాయ‌ణ‌

ముఖ్యమంత్రి వ్యాఖ్యల మేరకు మూడు జిల్లాల వైసీపీ అధ్యక్షులు స్వయంగా ముందుకు వచ్చి, తమను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. మిగితా 5 జిల్లాలకు హైకమాండే కొత్త అధ్యక్షులను నియమించింది. కుప్పం జిల్లాకు అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించారు. అంతకు ముందు ఆ జిల్లాకు ఎమ్మెల్సీ భరత్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే శాసన సభ్యులు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను వారి జిల్లా అధ్యక్షుల పదవుల నుంచి తొలగించారని ‘ఈనాడు’పేర్కొంది. వీరితో పాటు రీజినల్ కో ఆర్డినేటర్ లుగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లను బాధ్యతల నుంచి తప్పించారు.

మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో సోదాలు: అర్థరాత్రి హైడ్రామా, పోలీసులకు ఫిర్యాదులు

వీరితో పాటు పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న మరి కొందరు రీజినల్ కో ఆర్డినేటర్లను తొలగించింది. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డిను రీజినల్ కో ఆర్డినేటర్ గా కొనసాగిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే ఉన్న నెల్లూరు జిల్లాలో పాటు, వైఎస్సార్, తిరుపతి జిల్లాను కూడా చేర్చారు. కర్నూల్, నంద్యాల కో ఆర్డినేటర్ బాధ్యతను జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి అప్పగించారు.

జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

బాపట్ల కో ఆర్డినేటర్ బాధ్యతను పార్లమెంట్ సభ్యుడైన బీద మస్తాన్‌రావుకు, పల్నాడు కు ఎమ్మెల్యే భూమనకు అప్పగించారు. గుంటూరు కో ఆర్డినేటర్ బాధ్యతను మర్రి రాజశేఖర్ కు అందజేశారు. ఆయనకు ఇదే వరకే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు బాధ్యత వహిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి ఈ మూడు జిల్లాలు బాధ్యతలను అందజేశారు. మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డిల పదవులు అలాగే కొనసాగుతున్నాయి. బొత్స సత్యనారాయణ నుంచి విజయనగరం జిల్లాను టీటీటీ చైర్మన్ సుబ్బారెడ్డికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆయన నుంచి అల్లూరి జిల్లాను బొత్సకు ట్రాన్స్ ఫర్ చేశారు. 

click me!