వివాహిత ఆత్మహత్య.. రూ.4లక్షల నష్టపరిహారం

Published : Dec 04, 2018, 03:17 PM IST
వివాహిత ఆత్మహత్య.. రూ.4లక్షల నష్టపరిహారం

సారాంశం

పెళ్లైన ఆరునెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. ఆమెచావుకు కారణం ఏంటో తెలుసుకోవాల్సిన గ్రామ పెద్దలు.. అత్తింటి వారిచే యువతి తల్లిదండ్రులకు రూ.4లక్షలు నష్ట పరిహారంగా ఇప్పించారు. 

పెళ్లైన ఆరునెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. ఆమెచావుకు కారణం ఏంటో తెలుసుకోవాల్సిన గ్రామ పెద్దలు.. అత్తింటి వారిచే యువతి తల్లిదండ్రులకు రూ.4లక్షలు నష్ట పరిహారంగా ఇప్పించారు. ఈ దారుణ సంఘటన విశాఖలో చోటుచేసుకుంది..

పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖలోని మధురవాడకు చెందిన కీర్తన కు అదే ప్రాంతానికి చెందిన యువకుడితో 2018లో వివాహం జరిగింది. కీర్తన తన భర్తతో కలిసి బక్కన్నపాలెం ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటుంది.  ఆరు నెలలపాటు వీరి సంసారం బాగానే సాగింది. కాగా.. ఇటీవల కీర్తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

దీంతో.. కీర్తన తల్లిదండ్రులు.. భర్త, అత్తమామలే  తమ కుమార్తెను చంపేశారంటూ ఆరోపించారు. దీనిపై పంచాయితీ పెట్టిన గ్రామస్థులు.. రూ.4లక్షలు కీర్తన తల్లిదండ్రులకు ఆమె భర్త చేత ఇప్పించారు. అనంతరం నడుము నొప్పి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారి తల్లిదండ్రుల చేతనే పోలీసులకు చెప్పించడం విశేషం. పోలీసులు కూడా ఆత్మహత్య కా కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu