ఎన్నికలపై మాజీ మంత్రి కామినేని సంచలన నిర్ణయం

Published : Dec 04, 2018, 03:01 PM IST
ఎన్నికలపై మాజీ మంత్రి కామినేని సంచలన నిర్ణయం

సారాంశం

మాజీ మంత్రి కామనేని శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయనని ఆయన స్పష్టం చేశారు. 

మాజీ మంత్రి కామనేని శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయనని ఆయన స్పష్టం చేశారు. అలా అని రాజకీయాలకు దూరంగా ఉండనని చెప్పారు. కేవలం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని తెలిపారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలపై స్పష్టతనిచ్చారు. గత కొంతకాలంగా తాను టీడీపీలో చేరుతున్నానంటూ వార్తలు వెలువడ్డాయని.. అవన్నీ వాస్తవం కాదని చెప్పారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.  గత ఎన్నికల్లో వెంకయ్యనాయుడు పిలుపుతో తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు.

వెంకయ్య నాయుడే స్వయంగా తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. అలా అప్పుడు అధికారంలోకి వచ్చి.. తన నియోజకవర్గానికి కృషి చేశానని చెప్పారు. కాగా.. ఉన్నట్టుండి కామినేని ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu