నీ మొగుణ్ణి చంపేస్తాం: వివాహితను లొంగదీసుకుని ఏడాదిగా నలుగురి అత్యాచారం

Siva Kodati |  
Published : Jul 17, 2019, 07:56 AM ISTUpdated : Jul 17, 2019, 12:34 PM IST
నీ మొగుణ్ణి చంపేస్తాం: వివాహితను లొంగదీసుకుని ఏడాదిగా నలుగురి అత్యాచారం

సారాంశం

ఓ వివాహితను నలుగురు వ్యక్తులు బెదిరించి ఆమెపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్న ఘటన రాయదుర్గంలో సంచలనం కలిగించింది

ఓ వివాహితను నలుగురు వ్యక్తులు బెదిరించి ఆమెపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్న ఘటన రాయదుర్గంలో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే...  అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ వీధిలో దంపతులు చేతి వృత్తి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఆ మహిళ రోజు పాల ప్యాకెట్ కోసం ఓ పాల వ్యాపారి వద్దకు వెళ్లేది. దీంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో పాటు ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మరింత దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసి నీ భర్తకు చెబుతానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. అప్పటి నుంచి వివాహతేర సంబంధం కొనసాగించడమే కాకుండా.. తన ముగ్గురు స్నేహితులకు ఆమెను పరిచయడం చేశాడు.

వీరు సైతం పాల వ్యాపారి పథకాన్ని అమలు చేసి చెబుతామని బెదిరించి ఒక్కొక్కరికగా లొంగదీసుకున్నారు. ఏడాదిగా వీరి వేధింపులు భరిస్తూ వచ్చిన ఆమెకు ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి.

తమ మాట వినకపోతే నీ భర్తను చంపేస్తామని.. నీపై యాసిడ్ పోస్తామని బెదిరింపులకు దిగారు. చివరకు చేసేది లేక ఆమె అసలు విషయం భర్తకు చెప్పింది. మంగళవారం భార్యాభర్తలిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని .. మరో  ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్