కేంద్రాన్ని గౌరవించాలి, వాటి జోలికి వెళ్లడం సరికాదు: జగన్ కు బీజేపీ సూచన

By Nagaraju penumalaFirst Published Jul 16, 2019, 6:50 PM IST
Highlights

మరోవైపు జగన్ ప్రభుత్వం రాజధాని కోసం కొత్త డీపీఆర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలిస్తోందని చెప్పారు. రాజధానికి ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పడంలో గత ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు ఎమ్మెల్సీ మాధవ్. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం రాసిన లేఖలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. 

ఒప్పందం జరిగిన తర్వాత మళ్లీ వాటి జోలికి వెళ్లడం సరికాదన్నారు. 

పీపీఏల వల్ల భారం పెరిగిందనుకుంటే ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో మాట్లాడి భారం తగ్గించుకోవాలని చెప్పారు. 

గత ప్రభుత్వం చేసిన పనులపై విచారణ జరపాలన్న సీఎం నిర్ణయం పెట్టుబడులు పెట్టే వారిలో ఆందోళన కలిగిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల వేరే చోటికి తరలిపోతున్నాయి

రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు ఎక్కడకక్కడ నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం తన ప్రాధాన్యత కాదని జగన్ చెప్పటంతో నిర్మాణ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. 

స్థిరాస్తి రంగంలో ధరలు పడిపోతున్నాయని వాటిని కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత తరుణంలో వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. 
భవన నిర్మాణ కార్మికులు వలస పోయే పరిస్థితి ఏర్పడిందని వాటిని అడ్డుకట్ట వేయాలని కోరారు. 


మరోవైపు జగన్ ప్రభుత్వం రాజధాని కోసం కొత్త డీపీఆర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలిస్తోందని చెప్పారు. రాజధానికి ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పడంలో గత ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు ఎమ్మెల్సీ మాధవ్. 

click me!