బాలికకు మత్తుమందిచ్చిన వివాహిత... స్పృహ కోల్పోయాక ఏం చేసింది..?

Published : Feb 23, 2023, 08:44 AM ISTUpdated : Feb 23, 2023, 08:55 AM IST
బాలికకు మత్తుమందిచ్చిన వివాహిత... స్పృహ కోల్పోయాక ఏం చేసింది..?

సారాంశం

బాలికకు మత్తుమందు కలిపిన పానియం తాగించి ఉదయం నుండి సాాయంత్రం వరకు స్నృహలోలేకుండా చేసిందో వివాహిత. అయితే స్ఫృహలో లేని సమయంలో బాలికను వివాహిత ఏం చేసిందో తెలియాల్సి వుంది.  

ఒంగోలు : బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన వివాహిత మత్తుమందు ఇచ్చిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. అయితే స్పృహ కోల్పోయిన బాలికను వివాహిత ఏం చేసింది... లైంగికదాడికి ఏమయినా పాల్పడ్డారా... ఎందుకోసం మత్తుమందు ఇచ్చింది...? అనేది తెలియాల్సి వుంది. బాలిక తండ్రిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునేందుకు వైద్యపరీక్షలు చేయిస్తున్నారు.  

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నివాసముండే వివాహిత కాలనీకే చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. బాలికను మాటల్లో పెట్టి మత్తుమందు కలిపిన పానియాన్ని తాగించింది. దీంతో బాలిక ఉదయం స్పృహ కోల్పోయి సాయంత్రానికి తిరిగి స్పృహలోకి వచ్చింది. దీంతో తనకేం జరిగిందో అర్థకాక భయపడిపోయిన బాలిక వెంటనే ఇంటికి పరుగుత్తుకుని వెళ్ళి తల్లదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

పోలీసులు బాలికకు మత్తుమందిచ్చిన మహిళ ఇంటిని పరిశీలించారు. అసలు బాలికకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇందుకోసం బాలికను హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ వస్తే బాలికపై ఏదయినా అఘాయిత్యం జరిగిందా అన్నది తెలుస్తుందని.. ఆ తర్వాతే వివాహితపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. 

Read More  కన్న కూతురిపై లైంగికవేధింపులు... మందలించిన తండ్రిపై ఆకతాయి కుటుంబం గొడ్డళ్లు, కత్తులతో దాడి

ఇదిలావుంటే ఇటీవల హర్యానా గురుగ్రామ్ లో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. ఉద్యోగం కోసం వెళ్లిన 27ఏళ్ళ యువతికి మత్తుమందు ఇచ్చి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు.  గురుగ్రామ్ లోని సహారా మాల్ లోని బేస్మెంట్లో ఈ ఘటన జరిగింది.  

ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువతి ఉద్యోగాన్వేషనలో వుండగా ఇంటర్వ్యూ పేరుతో పిలిచాడు నిందితుడు. దీంతో యువతి సహారా మాల్ కు వెళ్లగా... ఇంటర్వ్యూకు ఇంకా టైం ఉందని చెప్పి ఆమెను బేస్ మెంట్ లోని తన కారు వద్దకు తీసుకువెళ్లాడు. మంచినీళ్లు తాగమంటూ ఆమెకు ఓ బాటిల్ అందించగా... ఆ నీరు తాగిన యువతి వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో అపస్మారక స్థితిలో వున్న ఆమెపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. 

స్పృహలోకి వచ్చిన యువతి తనపై జరిగిన అత్యాచారంపై సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  తుషార్ శర్మ అనే వ్యక్తిని తాను ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతుకుతూ సంప్రదించానని.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు యువతి పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!