
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా ఎలమంచి మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ హిజ్రాను దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత సగం కాల్చేసి రోడ్డు పక్కన మృతదేహాన్ని వదిలేసి వెళ్లారు. భయానకమైన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సుమారు 20 ఏళ్ల వయసున్న హిజ్రా.. మర్రిబంద సమీపంలో సగం కాలిన మృతదేహం స్థితిలో కనిపించింది. ఆ హిజ్రా మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి ముఖం మీద, శరీరంపై గాయాలు ఉన్నాయి. బుధవారం ఉదయం స్థానిక ప్రైవేటు సంస్థ కార్యాలయానికి చెందిన ఓ సెక్యూరిటీ గార్డు.. మూత్ర విసర్జన కోసం వెళ్ళాడు. ఆ సమయంలో పక్కనే గోతిలో నుంచి తీవ్రంగా దుర్వాసన వచ్చింది. అనుమానంతో ముందుకు వెళ్లి చూడగా హిజ్రా మృతదేహం కనిపించింది.
హిజ్రాలకు క్షమాపణ చెప్పిన వైఎస్ షర్మిల.. వారిని కించపరిచే ఉద్దేశం లేదని వివరణ..
వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ గౌతమి సాలి, డిఎస్పి శ్రీనివాసరావు, సిఐ షేక్ గఫూర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఇస్రాకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలుస్తుందా అని స్థానికంగా ఉండే హిజ్రాలను తీసుకువచ్చి చూపించారు. అయితే వారు చనిపోయింది తమ వారెవరు కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలియజేశారు. గుర్తుతెలియని హిజ్రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు జూలైలో పులివెందులలో హిజ్రాపై (50) అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత హిజ్రా 13మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బుధవారంనాడు దిశ యాప్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే దీని మీద దర్యాప్తు చేపట్టారు. పులివెందులకు చెందిన పీ చక్రధర్, కే చలపతి, ఏ బాల గంగిరెడ్డి, పి గురు ప్రసాద్, కే కుమార్, ఎస్ బ్రహ్మయ్య, పి. జయచంద్ర శేఖర్ రెడ్డి, ఎం హరికృష్ణరెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ఓ ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సురేంద్ర, షాకీర్, సుభాష్.. లు నిందితులుగా గుర్తించారు.
వీరు ఓ పంచాయతీ కోసం సత్య జిల్లా రాగన్నగారిపల్లెకు రెండు వాహనాల్లో వెళ్లారు. తిరిగి పులివెందులకు వస్తూ.. కదిరి రహదారిలోని గంగమ్మ గుడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు హిజ్రాల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలించారు. కదిరి రహదారిలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో చక్రధర్, చలపతి, బాలగంగి రెడ్డి, గురు ప్రసాద్, కుమార్, బ్రహ్మయ్య, జయ చంద్రశేఖర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి కనిపించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.