పోలీస్ స్టేషన్‌లో దంపతులకు కౌన్సిలింగ్.. పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య..

Published : Oct 20, 2022, 03:10 PM ISTUpdated : Oct 20, 2022, 03:16 PM IST
పోలీస్ స్టేషన్‌లో దంపతులకు కౌన్సిలింగ్.. పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య..

సారాంశం

విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసు స్టేషన్‌లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలోనే.. భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 

విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసు స్టేషన్‌లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలోనే.. భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్లి పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. విశాఖపట్నంకు చెందిన వినయ్‌కు గుంటూరుకు చెందిన శ్రావణితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే శ్రావణి.. బుధవారం ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

దీంతో పోలీసులు భార్యభర్తలు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు స్టేషన్‌కు పిలించారు. ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో.. ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వెళ్లిన శ్రావణి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన శ్రావణిని పోలీసులు మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శ్రావణి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే  కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో భర్తతో మాట్లాడుతుండగా శ్రావణి బయటకు వెళ్లినట్టుగా చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పెద్ద కోటమకనపల్లి గ్రామ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి | Asianet News Telugu
CM Chandrababu: ధూళిపాళ్ల నరేంద్ర కూతురి పెళ్లిలో చంద్రబాబు | Wedding Video | Asianet News Telugu