అన్నీ చెప్పాను,పార్టీమార్పుపై ఇలా: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

By narsimha lode  |  First Published Oct 20, 2022, 2:59 PM IST

పార్టీలో జరుగుతున్న పరిణామాలను తాను నిన్ననే చెప్పానని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ  చెప్పారు.పార్టీ అధిష్టానం సూచనలను పాటిస్తానన్నారు.పార్టీమార్పుపై కూడా ఆయన తేల్చేశారు.



గుంటూరు: తాను చెప్పాలనుకొంది  నిన్ననే  చెప్పానని  బీజేపీ  సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం  చేశారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు తాను నడుచుకొంటానని  ప్రకటించారు.అంతేకాదు తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంపై పార్టీ అనుచరులకు  కన్నాలక్ష్మీనారాయణ స్పష్టత ఇచ్చారు.

బీజేపీ సీనియర్ నేత  కన్నా  లక్ష్మీనారాయణకు బీజేపీ అధిష్టానం గురువారంనాడు ఫోన్ చేసింది. పవన్ కళ్యాణ్  విషయమై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం చర్చించింది. మీ వాదనను అర్ధం  చేసుకున్నామని బీజేపీ నాయకత్వం  తెలిపింది. పార్టీ అంతర్గత  వ్యవహరాలపై మాట్లాడవద్దని కూడా సూచించింది. 

Latest Videos

undefined

తాను ఏం చెప్పాలనుకున్నానో అదే విషయాన్ని నిన్ననే చెప్పానని కన్నా లక్ష్మీనారాయణ  గుర్తు చేశారు. కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని  ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు. గురువారం నాడు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో కన్నా లక్ష్మీనారాయణ  చిట్  చాట్  చేశారు.పార్టీ ఆదేశాలను తాను పాటిస్తానని తేల్చి  చెప్పారు. పార్టీలో చోటు  చేసుకున్న పరిణామాలను అధిష్టానానికి వివరించినట్టుగా చెప్పారు. అయితే  ఈ విషయాలన్నింటిని తాను  మీడియాతో చర్చించాలనుకోవడం లేదన్నారు. 

పవన్ కళ్యాణ్ విషయంలో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తాను వ్యాఖ్యలు  చేసినట్టుగా ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత తన అనుచరులు తనతో సమావేశం కావడంతో పార్టీ మారుతారనే ప్రచారం  సాగిన  విషయమై స్పందించారు .తాను పార్టీ మారుతాననే దుష్ప్రచారం కూడా సాగిందన్నారు.

alsoread:కన్నాకు బీజేపీ నాయకత్వం ఫోన్: భారీగా లక్ష్మీనారాయణ ఇంటికి అనుచరులు

రెండు రోజుల క్రితం పార్టీ కార్యకర్తల సమావేశంలో  పవన్ కళ్యాణ్  కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఊడిగం  చేయలేనన్నారు.  ఈ వ్యాఖ్యలు  బీజేపీపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిని తెలుపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సయంలో  కన్నా లక్ష్మీనారాయణ కూడా బీజేపీ  రాష్ట్ర నాయకత్వంపై  సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పవన్  కళ్యాణ్ తో సమన్వయం  చేసుకోవడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ  వ్యాఖ్యానించారు.సోము వీర్రాజు వ్యవహరించిన తీరును  కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి సోము వీర్రాజు నిరాకరించారు.కన్నాలక్ష్మీనారాయణ చాలా సీనియర్ నాయకుడన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను  పార్టీ నాయకత్వం గమనిస్తుందన్నారు.

click me!