
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ లు సీఐడీ విచారణకు బుధవారం హాజరుకాలేదు. ఈ విషయాన్ని వారు అధికారులకు ముందుగానే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. రామోజీరావు ఆరోగ్యం బాగాలేదని, అందుకే గుంటూరులో జరిగే ఈ విచారణకు హాజరుకాలేకపోతున్నామని అందులో పేర్కొన్నారు.
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన లాయర్.. (వీడియో)
ఆర్బీఐ నిబంధనలు, చిట్ ఫండ్స్ విషయంలో ఉన్న కేంద్ర చట్టాలను ఉల్లంఘించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో రామోజీరావు ఏ1గా, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. వీరిద్దరిని ఆంధ్రప్రదేశ్ లో విచారించాని సీఐడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గత నెల 22వ తేదీన అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో జూలై 5వ తేదీన ఉదయం 10:30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని పేర్కొంది.
కాగా.. కొంత కాలం కిందట ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ కు వచ్చి విచారణ జరపాలని నిర్ణయించారు. అయితే ఆ అధికారులను రామోజీరావు సిబ్బంది చాలా సేపు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రాంతీయ ఆఫీసుకు రావాలని సీఆర్‌పీసీ 41(ఏ) ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేసింది.