దట్టమైన పొగమంచుతో శీతాకాలపు వండర్‌ల్యాండ్‌గా మారిన మన్యం.. ప్రమాదాలను సృష్టిస్తోంది !

By Mahesh Rajamoni  |  First Published Nov 4, 2023, 6:16 AM IST

Visakhapatnam: మన్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల‌లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. అనంతగిరిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.2 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి.
 


Manyam-Araku Valley: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలోని సుందరమైన మన్యం ప్రాంతం దట్టమైన పొగమంచుతో శీతాకాలపు వండర్‌ల్యాండ్‌గా మారిపోయింది. ఆహ్లాద‌క‌ర‌మైన శీతాకాల గ‌మ్య‌స్థానాల్లో ఒక‌టిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ప‌ర్యాట‌కులు పెద్ద ఎత్తున వ‌స్తున్నారు. అయితే, పర్యాటకులను ఆహ్లాదపరిచే అదే వాతావరణ పరిస్థితులు ప్రమాదకరమైన రహదారి పరిస్థితులను కూడా సృష్టించాయి. ఇది ప్రయాణీకులు, ప‌ర్యాట‌కులకు గణనీయమైన సవాళ్లను విసురుతోంది.

అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పాటు ద‌ట్ట‌మైన‌ పొగమంచు మన్యం, దాని పరిసర ప్రాంతాలను చుట్టుముట్టడంతో దృశ్యమానత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దట్టమైన పొగమంచులో కేవలం 100 అడుగుల దూరంలో వాహనాలు కనిపించకుండా పోవడంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయాలు ప్రమాదకరంగా మారుతున్నాయి.

Latest Videos

undefined

మన్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అనంతగిరిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.2 డిగ్రీల సెల్సియస్ చేరాయి. ఇదే స‌మ‌యంలో 106.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచ‌నా వేస్తున్నారు. అరకులోయలో మొత్తం 73.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందనీ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. చింతపల్లిలో మొత్తం 87.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందనీ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఈ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు నివాసితులకు, పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లను ఉపయోగించడం, వాహనాల మధ్య సురక్షితమైన దూరాలను నిర్వహించడం, తక్కువ విజిబిలిటీతో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి తక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడం వంటి సూచ‌న‌లు చేశారు.

click me!