ప్రజలను మోసం చేయడంలో నిపుణుడు.. చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావు

By Mahesh Rajamoni  |  First Published Nov 4, 2023, 5:46 AM IST

Visakhapatnam: ప్ర‌తిప‌క్ష పార్టీలైన తెలుగు దేశం పార్టీ (టీడీపీ), జ‌న‌సేన‌, బీజేపీలు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంపై మండిప‌డ్డ రాష్ట్ర ఆర్థిక మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావు.. పెట్రోలు, డీజిల్ వంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు, కానీ ఈ ధరలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని మంత్రి ఎత్తిచూపారు.
 


Dharmana Prasada Rao: ప్రజలను మోసం చేయడంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు నిపుణుడ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అభివర్ణించారు. కల్లేపల్లిలో వైఎస్‌ఆర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ పాల‌న‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. టీపీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. అయితే,  2019 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని  ప్ర‌క‌టించిన 99 శాతం హామీలను నెరవేర్చింద‌ని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవంతో ఆయనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు. కానీ దీనిని మ‌ర్చిపోయి ప్ర‌జ‌ల సంక్షేమ కోసం చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. రుణాలను మాఫీ చేయకపోవడంతో ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఏపీలో అభివృద్ధి జరగడం లేదని టీడీపీ మద్దతు ఉన్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సంస్థలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రసక్తే లేదన్నారు.

Latest Videos

undefined

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైకాపా ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు పెట్రోలు, డీజిల్ వంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. వారి మ‌ద్ద‌తు ఉన్న వీడియా సంస్థ‌లు ఇదే ప్ర‌చారం చేస్తున్నాయి. కానీ ఈ ధరలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయ‌నేది గుర్తించాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఎత్తిచూపారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పాకిస్థాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చినందుకు సీఎం జగన్‌ను  కొనియాడారు.

అంత‌కుముందు రోజు మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావు మీడియా తో మాట్లాడుతూ.. ఆకలి, కన్నీళ్లు, పేదరిక నిర్మూలన కోసం తమ‌ ప్రభుత్వం అనేక‌ పథకాలను రూపొందించిందని అన్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో  వైకాపా పాలన సాగిస్తోందని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిందనీ, ప్ర‌జా అభిప్రాయం తెలుసుకునేందుకే గడప గడపకూ కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ''రైతులకు 13,500 పెట్టుబడి సాయం అందించాం.. ప్రభుత్వ విద్యారంగంలో సమూల మార్పులు చేశాం.. సిలబస్‌ను మార్చాం. భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా విద్యార్థులను సన్నద్ధం  చేస్తున్నాం'' అని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ చేసిన విమ‌ర్శ‌లను ఖండిస్తూ.. సీఎం జ‌గ‌న్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారనీ, పేద పిల్లలకు మంచి చదువులు అందిస్తున్నారన్నారు. అయితే,  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు చేసిందేమీ లేదనీ, ఇప్పుడు జగన్‌పై అందిస్తున్న మెరుగైన పాల‌న చూడ‌లేక టీడీపీ నేతలు ఇలా విషం క‌క్కుతున్నార‌ని మండిపడ్డారు.

click me!