మాన్సాస్ వివాదం: కుటుంబ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యమెంటీ.. ఊర్మిళ పిటిషన్‌పై అశోక్ స్పందన

By Siva KodatiFirst Published Aug 10, 2021, 7:35 PM IST
Highlights

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తనను తప్పించాలంటూ ఊర్మిళ గజపతి రాజు వేసిన పిటిషన్‌పై అశోక్ గజపతి రాజు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన.. కోర్టుకు ఎవైరా వెళ్లవచ్చని పేర్కొన్నారు. 

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తనను తప్పించాలంటూ ఊర్మిళ గజపతి రాజు వేసిన పిటిషన్‌పై అశోక్ గజపతి రాజు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన.. కోర్టుకు ఎవైరా వెళ్లవచ్చని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారం అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందని అశోక్ ప్రశ్నించారు. ధర్మాన్ని నిలబెట్టాలని ఆయన కోరారు. 

Also Read:కొట్టేసిన జీవోతో కోర్టుకెళ్లారు: ఊర్మిళ పిటిషన్ పై ఆశోక్‌గజపతిరాజు రియాక్షన్

అంతకుముందు మంగళవారం నాడు ఓ తెలుగున్యూస్ ఛానెల్‌తో అశోక్ గజపతి రాజు మాట్లాడారు. ఎవరు చైర్మెన్ గా ఉండాలో ట్రస్ట్ డీడ్ లో స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో ప్రభుత్వం సమాన హక్కు కల్పించిందన్నారు. ఆలయాలు , మాన్సాస్ ట్రస్టులో సమాన హక్కులు కల్పించేందుకు అవి స్వంత ఆస్తులు కాదని ఆయన చెప్పారు. తన మీద ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులకు చట్టప్రకారంగా సహకరిస్తామని ఆయన చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా సంచయిత గజపతిరాజు ఉన్న సమయంలో ఎందుకు విచారణ జరపలేదని  ఆయన ప్రశ్నించారు.

click me!