వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏలు

By Siva KodatiFirst Published Aug 10, 2021, 6:45 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డి, హోంగార్డు నాగభూషణం, బాలకృష్ణారెడ్డి, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లి, సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు విచారించారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా మంగళవారం పులివెందుల గెస్ట్‌హౌస్‌లో 8 మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డి, హోంగార్డు నాగభూషణం, బాలకృష్ణారెడ్డి, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లి, సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ సోమవారం రాత్రి పులివెందులలో మీడియాతో మాట్లాడారు. సునీల్ యాదవ్ ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తమ కుమారుడిని 24 గంటల లోపల విడుదల చేయకపోతే తమ కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటారని సావిత్రమ్మ హెచ్చరించారు. తమ కుమారుడు సునీల్ యాదవ్ ఏ విధమైన నేరం కూడా చేయలేదని ఆమె అన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడని, ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. 

Also Read:వైఎస్ వివేకా హత్య కేసు: ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడి తల్లి హెచ్చరిక

వివేకా హత్య జరిగిన తర్వాత అందరిలాగానే తన కుమారుడు కూడా వెళ్లాడని ఆమె చెప్పారు. వివేకానంద రెడ్డి తమకు దేవుడిలాంటివాడని ఆమె చెప్పారు. అందుకే సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డితో ఉన్నాడని అన్నారు. వివేకానంద రెడ్డి రెండు సార్లు తమ ఇంటికి కూడా వచ్చారని ఆమె వెల్లడించారు.

click me!