అమరావతి భూముల రగడ.. 4,500 ఎకరాలు కొట్టేసే కుట్ర, బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలి: ఆర్కే

By Siva KodatiFirst Published Jul 4, 2021, 2:40 PM IST
Highlights

అమరావతి భూముల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. సీఆర్‌డీఏ మాజీ అధికారి చెరుకూరి శ్రీధర్ ప్రకటనతో ఈ వ్యవహారం రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

అమరావతి భూముల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. సీఆర్‌డీఏ మాజీ అధికారి చెరుకూరి శ్రీధర్ ప్రకటనతో ఈ వ్యవహారం రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహించారని ఆరోపించారు. అమరావతి వ్యవహారంలో అక్రమాలు జరిగాయనడానికి సాక్షాధారాలు వున్నాయని ఆర్కే చెప్పారు. ఇందుకు సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు ఆర్కే.

అసైన్డ్ భూముల లిస్ట్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారని... రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల అసైన్డ్ భూములను కొన్నారని ఆయన ఆరోపించారు. భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక ప్యాకేజీ ప్రకటించారని ఆర్కే చెప్పారు. దళితుల భూమిని లాక్కోవడానికి బ్రహ్మానందరెడ్డికి హక్కు ఎక్కడిదని ఆర్కే ప్రశ్నించారు. బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలని సీఐడీ అధికారులను కోరుతున్నా అన్నారు.

Also Read:మాజీ మంత్రి నారాయణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... హైకోర్టులో సీఐడి కౌంటర్

ప్రభుత్వ రికార్డులను కూడా మార్చేశారని.. 4,500 ఎకరాల భూములను కొట్టేయడానికి స్కెట్ వేశారని ఆర్కే ఆరోపించారు. ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఈ అక్రమాలకు సహకరించారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కూడా సహకరించారని ఆర్కే ఆరోపించారు. అధికారులు సొంత సామాజిక వర్గానికే అన్యాయం చేశారని అన్నారు.
 

click me!