పవన్ కల్యాణ్ తో పెట్టుకుంటే అంతే సంగతి ... పొలిటీషన్స్ అయినా, ఇలాంటి పోలీసులైనా..!! 

Published : Jun 27, 2024, 06:40 PM ISTUpdated : Jun 27, 2024, 06:41 PM IST
పవన్ కల్యాణ్ తో పెట్టుకుంటే అంతే సంగతి ... పొలిటీషన్స్ అయినా, ఇలాంటి పోలీసులైనా..!! 

సారాంశం

మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద ఓ పోలీస్ అధికారి ఓవరాక్షన్ చేసాడు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహానికి గురయిన సదరు అదికారిపై వేటు పడింది. ఆ పోలీస్ ఎవరు..? ఆ సంగతి ఏమిటంటే.... 

అమరావతి : 'నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది' ఇది సినిమాల్లో పవన్ కల్యాణ్ డైలాగ్. ఇది పవన్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ కోపం ప్రదర్శించాలో... ఎక్కడ శాంతంగా వుండాలో  ఆయనకు బాగా తెలుసు. గత పదేళ్ళు జనసేన పార్టీని నడిపిన విధానం... ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు చూస్తే ఎక్కడ తగ్గాలో... ఎక్కడ నెగ్గాలో పవన్ కి  బాగా తెలుసని అర్థమవుతుంది. 

సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ ఎన్ని పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలిచారు పవన్. అవమానాలను ఎదుర్కొన్నాడు... బాధలను భరించాడు... అయినా రాజకీయాలను విడిచిపెట్టలేదు. ఇలా దశాబ్ద కాలం రాజకీయాల్లో పవర్, పదవులు లేకపోయిన ప్రజల్లోనే వున్నాడు పవన్. దీంతో పవర్ స్టార్ కాస్త పవర్ ఫుల్ స్టార్ అయ్యారు... 100శాతం సక్సెస్ రేట్ తో విజయదుందుభి మోగించి డిప్యూటీ సీఎం అయ్యారు. 

పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ది, పంచాయితీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి... ఇవన్నీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పదవులు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతలని... జనసేన నాయకులు, కార్యకర్తలు అందించిన హోదాలని పవన్ చెబుతున్నారు. మరి అలాంటి జనసైనికుల జోలికి ఎవరైనా వస్తే ఊరికుంటారా... అస్సలు వదిలిపెట్టరు... ఇలా గతంలో జనసైనికులను, ఇప్పుడు పవన్ ను ఇబ్బందిపెట్టిన ఓ పోలీస్ అధికారిపై వేటు పడింది.  

అసలేం జరిగింది : 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బ్ంది ఇళ్లలో పోలీసుల దాడులు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పనిచేసేవారు నివాసముండే అపార్ట్ మెంట్ లో  పోలీసులు నిర్వహించారు. రాత్రి పదిగంటల సమయంలో జనసేన సిబ్బంది ప్లాట్స్ లోకి వెళ్లి భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నంచేసారు పోలీసులు. ఈ దాడులు మంగళగిరి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే జరిగాయి... వైసిపి  పెద్దల మెప్పు కోసం ఆయన అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా అప్పుడు విమర్శలు వచ్చాయి.  

ఈ ఘటనను జనసేన నాయకులే కాదు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా మరిచిపోలేదు.  సరైన సమయం కోసం ఇంతకాలం ఎదురుచూసినట్లున్నారు... తాజాగా ఆ  సమయం రానే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మంగళగిరి సీఐలో మార్పు రాలేనట్లుంది. వారాహి దీక్షలో వున్న పవన్ కల్యాణ్ పూజలు చేస్తుండగా జనసేన కార్యాలయం వద్ద శ్రీనివాసరావు హంగామా సృష్టించారు. డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బంది వద్దని వారించినా వినకుండా కార్యాలయంలోకి వెళ్లాడు...అదీ బూటు కాళ్లతో. ఇలా మరోసారి జనసేన కార్యాలయ సిబ్బందితో దురుసుగా  ప్రవర్తించిన సీఐని ఈసారి పవన్ విడిచిపెట్టలేదు. మంగళగిరి సీఐపై పోలీస్ ఉన్నతాధికారులు వేటు వేసారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్ ను మంగళగిరి బాధ్యతలు అప్పగిస్తూ గుంటూరు ఐజీ  సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధికారిక ఆదేశాలిచ్చారు. 

ఇలా మంగళగిరి సీఐ శ్రీనివాసరావుపై వేటు పడటంపై జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పోలీస్ గా వుంటూ వైసిపికి తొత్తులా వ్యవహరించారని...  అతడికి తగిన శాస్తి జరిగిందని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ కల్యాణ్ తో పెట్టుకుంటే ఇలాగు వుంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. 


 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Srinivas Varma Speech at Amarajeevi Jaladhara Scheme Foundation Stone | Asianet News Telugu
Pawan Kalyan Powerful Speech: అమరజీవి జలధార పథకం శంకుస్థాపన | Jaladhara Scheme | Asianet News Telugu