
కడప : కడపలో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగులు. బాధితుడిని శ్రీనివాస్ రెడ్డి గా గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి జిమ్ ముగించుకుని వస్తుండగా వేట కొడవళ్లతో దాడి చేశారు నిందితులు.
బురఖాల్లో బైక్ మీద వచ్చిన నిందితులు శ్రీనివాస్ రెడ్డి మీద వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. కడపలోని సంధ్యా సర్కిల్ ప్రాంతంలో జరిగిన ఈ గొడవ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ రెడ్డిని హుటాహుటిన కడప రిమ్స్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు.
శ్రీనివాస్ రెడ్డి ఎవరు? అతడిని దుండగులు ఎందుకు చంపాలనుకున్నారు? హత్యకు కారణాలేంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.