ప్రతి రోజూ ఏదో రకమైన తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదరు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు మంచి జరుగుతుంటే టీడీపీ తట్టుకోలేకపోతుందన్నారు.
అమరావతి: CRDA భూముల విక్రయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
గురువారం నాడు సాయంత్రం తాడేపల్లిలో Sajjala Ramakrishna Reddy మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిపెస్టోలో 90 శాతానికి పైగా హామీలను సీఎం జగన్ నెరవేర్చారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. సీఎం YS Jagan ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం Chandrababu కు లేదన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక అబద్దంతో TDP తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.
undefined
కరోనా సమయంలో సీఎం జగన్ పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. కులం, మతం, పార్టీ అనే తేడా చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. వేల కోట్లతో ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు , సచివాలయ భవనాలను నిర్మించినట్టుగా సజ్జల చెప్పారు.
తమ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతిని ఇవ్వలేదన్నారు. మద్యంలో విషం కలుపుతున్నారనే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. టీడీపీ ఎజెండాను ఎల్లో మీడియా సిద్దం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల విషయమై ఎల్లోమీడియా ఇష్టానుసారం కథనాలు ప్రచురించిందని ఆయన ఆరోపించారు.విద్యార్ధుల భవిష్యత్తుపై చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని ఆయన అడిగారు.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిపివేయించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు.