నిందితుడికి కఠిన శిక్షపడాలి.. గుంటూరు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, రమ్య కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సాయం

Siva Kodati |  
Published : Aug 15, 2021, 09:51 PM ISTUpdated : Aug 15, 2021, 09:52 PM IST
నిందితుడికి కఠిన శిక్షపడాలి.. గుంటూరు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, రమ్య కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సాయం

సారాంశం

రమ్య హత్య కేసుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. విద్యార్థిని కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని జగన్ అధికారులను ఆదేశిస్తున్నాను.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే మృతురాలు రమ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. 

ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

 

 

కాగా, గుంటూరు జిల్లా పెదకాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఈయర్ విద్యార్ధిని రమ్య హత్యకు గురైన ఘటన కలకలం  రేపింది. రమ్యను  గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. మెడ కింది భాగంలో పొట్టపై విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.

పెదకాకాని రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ తీసుకొచ్చేందుకు గాను  రమ్య వచ్చింది. ఆ సమయంలో ఓ యువకుడు టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి ఆమెను బైక్ పై కూర్చోవాలని కోరాడు.అయితే యువతి నిరాకరించింది.దీంతో ఆ యువకుడు తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆ యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఇంటికి సమీపంలో చోటు చేసుకొంది. అనంతరం సాయంత్రానికి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu