మంత్రి వనిత సంతకం ఫోర్జరీ.. అడ్డంగా బుక్కైన టీడీపీ నేత

Published : Feb 13, 2020, 10:50 AM ISTUpdated : Feb 13, 2020, 12:43 PM IST
మంత్రి వనిత సంతకం ఫోర్జరీ.. అడ్డంగా బుక్కైన టీడీపీ నేత

సారాంశం

మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్ కు నిందితుడు రెడ్డప్ప సిఫార్స్ లేఖ పంపించాడు. అందులో మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారం అధికారుల ద్వారా మంత్రి దృష్టికివెళ్లింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేశారు.  ఆమె లెటర్ హెడ్ తోపాటు ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ అయ్యింది. కడపకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం. అతను టీడీపీ కి చెందిన వ్యక్తిగా ఆరోపిస్తున్నారు.

Also Read జగన్‌పై వ్యాఖ్యలు: రేణుదేశాయ్ వ్యవహారం ప్రస్తావన, పవన్‌కు వైసీపీ కౌంటర్...

మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్ కు నిందితుడు రెడ్డప్ప సిఫార్స్ లేఖ పంపించాడు. అందులో మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారం అధికారుల ద్వారా మంత్రి దృష్టికివెళ్లింది. దీంతో ఆమె ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. వెంటనే హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ లకు ఈ విషయమై  ఆమె ఫిర్యాదు చేశారు.

తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి వనిత వారికి కోరారు. కాగా... ఈ వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం