
అమరావతి: భూ వివాదంలో ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి కొరికి ముక్క తీసి పడేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో జరిగింది. వై పాలెం మండలం గడ్డమీదపల్లె గ్రామంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
గడ్డమీదపల్లె గ్రామంలో మాచపల్లె నాగరాజు తండ్రి 25 ఏళ్ల క్రితం అదే గ్రామంలో స్థలం కొన్నారు. తండ్రి కొనుగోలు చేసిన స్థలాన్ని మాచపల్లె నాగరాజు బాగు చేయిస్తున్నాడు. కాగా, అదే గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి ఆ స్థలం గ్రామ కంఠమని చెబుతున్నాడు. స్పందన కార్యక్రమంలోనూ ఈ మేరకు మురళి ఆర్జీ అందించాడు. ఈ విషయమై నాగరాజు, మురళిల మధ్య చెడింది.
Also Read: మేం ఎక్కడ తాగాలో కూడా మీరే చెప్పండి సారూ.. ఏపీలో ఎస్సైతో మందుబాబుల లొల్లి
సోమవారం రాత్రి నాగరాజు, అతని బంధువులను మురళి దూషించాడు. దీంతో నాగరాజు, అతని బంధువులు మురళిపై దాడికి దిగారు. ఈ దాడిలోనే మురళి చెవిని నాగరాజు కొరికేశాడు. దీంతో ఆ చెవి ముక్క తెగి కింద పడిపోయింది.