పల్నాడు జిల్లాలో అమానుషం... కూతురి వయసు చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం

Published : Mar 12, 2023, 08:50 AM ISTUpdated : Mar 12, 2023, 09:00 AM IST
పల్నాడు జిల్లాలో అమానుషం... కూతురి వయసు చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం

సారాంశం

పల్నాడు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

పల్నాడు : మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు షీ టీమ్స్, దిశ పోలీస్ స్టేషన్లు ఇలా మరెన్ని చర్యలు చేపట్టినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు.ఒంటరి మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు, అమ్మాయిలపై మ(మృ)గాళ్లు అత్యాచారానికి పాల్పడిన ఘటనలు అనేకం వెలుగుచూస్తూనే వున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కూతురు వయసున్న చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన అమానుషం వెలుగుచూసింది. 

పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు మెంటల్ కండీషన్ సరిగ్గా లేదు.ఆ బాలికను చూసి గ్రామస్తులంతా అయ్యో పాపం అంటూ జాలిచూపిస్తే ఓ కామాంధుడు మాత్రం మానవత్వాన్ని మరిచి నీచానికి పాల్పడ్డాడు.బాలిక నివాసముండే కాలనీలోనే బుల్లా హజరత్ మస్తాన్(45) వుండేవాడు. తండ్రి వయసున్న అతడిని చిన్నారి బాబాయ్ అని పిలిచేది. కానీ అతడు కూతురి వయసున్న బాలికపై కన్నేసాడు.  

గత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు మస్తాన్. దగ్గర్లోని తన ఇంటికి బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక తనతో మస్తాన్ ఎలా ప్రవర్తించాడో బాలిక తెలిపింది. దీంతో మతిస్థిమితం సరిగ్గాలేని తమ కూతురిపై అఘాయిత్యం జరిగినట్లు ఆ తల్లిదండ్రులకు అర్థమయ్యింది. దీంతో కుటుంబసభ్యులు అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

Read More  వివాహేతర సంబంధం : వ్యక్తిని దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసి..

అమాయక బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సత్తెనపల్లి డిఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి నెమలికల్లు వెళ్లి విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు. కూతురు వయసున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన మస్తాన్ పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని నెమలికల్లు వాసులు పోలీసులను కోరుతున్నారు. 

ఇక ఇటీవల కోనసీమ జిల్లాలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి మతిస్థిమితం సరిగ్గాలేని మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాదు అతి దారుణంగా హత్యచేసి చివరకు కన్న తల్లి ఆత్మహత్యకు కారకులయ్యారు. ఈ ఘటన రాయవరం మండలం సోమేశ్వరం పరిధిలో వెలుగు చూసింది. 

ఇటీవల మాచవరం దేవుడు మాన్యం కాలనీకి చెందిన ద్వారంపూడి గంగరాజు అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేని తన కూతురు సత్యవేణి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇదే క్రమంలో గత నెల 24వ తేదీన సోమేశ్వరం పరిధిలో ఓ మహిళ మృతదేహం గడ్డివాములో కాలిపోయిన స్థితిలో దొరకగా అది సత్యవేణిదిగా గుర్తించారరు పోలీసులు. ఆమెపై గ్రామానికి చెందిన నల్లమిల్లి ఉమామహేశ్వర్ రెడ్డి, వెంకట సత్యనారాయణ రెడ్డి అనే ఇద్దరు సోదరులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా గుర్తించారు. అయితే హత్య అనంతరం తప్పించుకుని తిరుగుతున్న నిందితుల తల్లి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం