వాళ్లంతా ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నారు.. కోటంరెడ్డి టార్గెట్‌గా అనిల్ కుమార్ యాదవ్ పరోక్ష వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 11, 2023, 09:36 PM IST
వాళ్లంతా ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నారు.. కోటంరెడ్డి టార్గెట్‌గా అనిల్ కుమార్ యాదవ్ పరోక్ష వ్యాఖ్యలు

సారాంశం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కొందరు ఇప్పుడు ఆఫీస్‌లో కూర్చొని ఈగలు తోలుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.   

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. శనివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని ఎదుర్కోలేక టీడీపీ, పీడీఎఫ్‌లు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్‌తో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అనిల్ అన్నారు. తద్వారా లక్షలాది మందికి ఉపాధి కలగబోతోందని ఆయన చెప్పారు. నెల్లూరులో కొందరు నేతలు తనపై పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వారిని పట్టించుకోనని అనిల్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు.

ఓ మీడియా ఛానెల్ డబ్బులు తీసుకుని వార్తలు రాస్తున్నారని.. అలా చేస్తున్న వారు ఎవరో కూడా తనకు తెలుసునని అనిల్ బాంబు పేల్చారు. ప్రతి దానికి తనదే బాధ్యత అంటే ఎలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అందరి పాపాలు పండే రోజు దగ్గరలోనే వుందని.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కొందరు ఇప్పుడు ఆఫీస్‌లో కూర్చొని ఈగలు తోలుకుంటున్నారని అనిల్ దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించినవేనని చర్చ నడుస్తోంది. 

Also REad: ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్దమా?: కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్ సవాల్

ఇకపోతే..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిర్వేదంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రి పదవి నుంచి తొలగించి మంచి పనిచేశారని వ్యాఖ్యానించారు. పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.. ఎవరు వుండరో అర్ధమైందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పలువురు కార్పోరేటర్లు తనను వీడినా బాధపడనని.. 2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లు తనను విడిచిపెట్టారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు తనను ఎందుకు వీడారో అర్ధం కాలేదన్నారు. తనను వీడినవాళ్లు అనిల్ అన్యాయం చేశాడా.. అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచించారు. 

తన ప్రత్యర్ధి రూ.180 కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ రూ.100 కోట్లు పైబడి ఆస్తులు వున్నవారు వున్నారని ఆయన తెలిపారు. వేదిక మీద అంతా వెయిట్ వున్నవాళ్లు వున్నారని.. తనకు వెయిట్ లేదని తనను పిలవలేదేమో అంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో పోట్లు కొత్త కాదని ఆయన అన్నారు. రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు.. కొంతమంది వెళ్తారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు తనకు చాలా కష్టం అంటున్నారని.. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఆయన అన్నారు. ప్రజలే తన వెంట వున్నారని అనిల్ చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్