పందుల దొంగల బీభత్సం.. వాహనాన్ని వెనక్కి తిప్పి.. అడ్డుకున్న యువకుడి హత్య..

By SumaBala BukkaFirst Published Jan 10, 2022, 7:09 AM IST
Highlights

పందులను దొంగిలించిన వాహనాన్ని జగన్నాథ్ బైక్ పై వెంబండించాడు. దీంతో వారు తమ వాహనాన్ని వెనక్కి తిప్పి ఎదురుగా వచ్చి బైకును ఢీ కొట్టారు. ఆ తరువాత వాహనాన్ని వదిలేసి దొంగలు పారిపోయారు. 

ఆదోని : కర్నూలు జిల్లా ఆదోనిలో Pig thieves బీభత్సం సృష్టించారు. దొంగతనాన్ని అడ్డుకున్న జగన్నాథ్ సురేష్ అనే యువకుడిని murder చేశారు. పందులను దొంగిలించిన వాహనాన్ని జగన్నాథ్ బైక్ పై వెంబండించాడు. దీంతో వారు తమ వాహనాన్ని వెనక్కి తిప్పి ఎదురుగా వచ్చి బైకును ఢీ కొట్టారు. ఆ తరువాత వాహనాన్ని వదిలేసి దొంగలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. దొంగలను కర్షాటకకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మహిళలపై సామూహిక  అత్యాచారాలకు తెగబడుతూ, పలు దోపిడీలకు పాల్పడిన కరుడుగట్టిన panyam robbery gangను ఎట్టకేలకు గుంటూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ జిల్లా పాణ్యం ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కూలీ పనుల కోసమంటూ ఇతర ప్రాంతాలకు వెళుతూ పగటిపూట రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి సమయంలో దారిదోపిడీలకు పాల్పడేవారు. 

నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను అడ్డగించి వారివద్ద ఆభరణాలు, నగదు దోచుకునేవారు. అంతటితో ఆగకుండా మహిళలు వుంటే వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారు. ఇలా గుంటూరు జిల్లా metikondur rape case మండలం పాలడుగు గ్రామ సమీపంలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తున్న జంటను ఈ దోపిడీ ముఠా అడ్డుకుంది. భర్తను చితకబాది అతడి ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల వద్దగల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. 

ఇక యడ్లపాడు పరిధిలోనూ ఇలాగే రెండు జంటలపై దాడిచేసి దోపిడికీ పాల్పడ్డారు. మరో ఘటనలో తల్లీ కొడుకులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ దోపిడీ ముఠా అడ్డుకుంది. కొడుకు ఎదుటే తల్లిపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ దోపిడీ ముఠా అఘాయిత్యాలకు పాల్పడింది. దారిదోపిడీ, మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 

దీంతో దోపిడీ ముఠా ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో దారుణాలకు పాల్పడుతున్నది పాణ్యం ప్రాంతానికి చెందిన ముఠాగా గుర్తించారు. గుుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పాణ్యం దోపిడీ ముఠా సమాచారాన్ని పంపించారు అధికారులు. 

దీంతో యడ్లపాడు పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అరెస్ట్ చేయగా వారే పాణ్యం ముఠాగా నిర్దారణ అయ్యింది. పోలీసులు విచారణలో ఈ ముఠా సంచలన విషయాలను బయటపెట్టింది. ఇప్పటివరకు కేవలం గుంటూరు జిల్లా పరిదిలోనే 30కి పైగా అత్యాచారం, దోపిడీలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కరుడుగట్టిన ముఠా సభ్యులకు కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్  చేస్తున్నారు. పోలీసులు కూడా వివిధ సెక్షన్ కింద వీరిపై కేసులు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. 

ఈ దోపిడీ ముఠా గతేడాది సెప్టెంబర్ 8వ తేదీ రాత్రిగుంటూరు జిల్లా మేడికొండూరు పాలడుగు గ్రామ శివారులో  బైక్ మీద వెళ్తున్న జంటను అడ్డగించి భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మహిళ భర్తను తీవ్రంగా కొట్టడమే కాదు కత్తులతో బెదిరించారు. ఆ తర్వాత వివాహితను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. 

click me!