సైకో మొగుడు.. భార్య బిడ్డలపై పైశాచికత్వం.. కరెంట్ తీగలు చుట్టి చంపేందుకు యత్నం...

Published : Feb 22, 2022, 09:35 AM ISTUpdated : Feb 22, 2022, 09:36 AM IST
సైకో మొగుడు.. భార్య బిడ్డలపై పైశాచికత్వం.. కరెంట్ తీగలు చుట్టి చంపేందుకు యత్నం...

సారాంశం

భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి సైకోలా మారాడు. తాళి కట్టిన భార్యను.. సొంత కొడుకును పైశాచికంగా హింసించాడు. దారుణంగా కొట్టడమే కాకుండా.. కరెంట్ షాక్ తో చంపాలని ప్రయత్నించాడు. 

దర్శి : Electrical wires చుట్టి భార్యా బిడ్డల మీద హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి ఉదంతం ఇది. ఆదివారం రాత్రి Darshiలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సౌ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... పొదిలి మండలంలోని సూదనగుంట రామాపురం గ్రామానికి చెందిన దేవం రమణారెడ్డికి దొనకొండ మండలం నారసింహనాయునిపల్లికి చెందిన కేజియాతో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి కుమారుడు రేవంత్ (6) ఉన్నాడు. రమణారెడ్డి సినిమా హాలును లీజుకు తీసుకుని నిర్వహిస్తుంటాడు. ప్రస్తుతం దర్శిలోని పొదిలి రోడ్డులో వీరు నివాసం ఉంటున్నారు. భార్య మీద Suspicionతో తరచూ ఆమెను దూషిస్తూ కొట్టేవాడు. 

ఇటీవల గొడవలు తీవ్రం అయ్యాయి. ఆదివారం రాత్రి ఆమెను రమణారెడ్డి తీవ్రంగా గాయపరిచాడు. కుమారుడి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. అంతేగాక ఇద్దరి శరీరాలకు తీగలు చుట్టి విద్యుదాఘాతం ద్వారా మట్టుబెట్టేందుకు యత్నించాడు. దీంతో రేవంత్ శరీరం మీద తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి కేకలకు నిద్ర లేచిన ఇంటి యజమాని అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూసి రమణారెడ్డి పరారయ్యాడు. 

బాధితులకు దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి ఒంగోలు తరలించారు. కెజియా ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

ఇదిలా ఉండగా, బెంగళూరులో నిరుడు నవంబర్ లో ఇలాంటి దారుణమే జరిగింది. రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసిన కామాంధున్ని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన చందన్ (38) నిందితుడు. మంగళూరులోని హోయి బజార్ లో బీహార్ కు చెందిన సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. 

ఘటన జరిగిన రోజు సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో చందన్ ఓ బాలికపై rape చేసి అనంతరం నీళ్లు లేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కాలనీ అంతా వెదికి చివరగా రాత్రి 9 గంటల సమయంలో water tankలో చూడగా చిన్నారి స్పృహ తప్పి పడి ఉంది. 

తక్షణం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు  విచారణ జరపగా చిన్నారిని చందన్ తీసుకెళ్లాడని తెలిసింది. చందన్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా నిజం ఒప్పుకున్నాడు. 

కాగా,  మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై gang rapeకి పాల్పడ్డారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్ స్పెక్టర్ సైదులు  తెలిపారు.  బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన minor girl (17) ఇది చెత్త ఏరుకునే జీవించి పేద కుటుంబం. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో milk packet తీసుకు వచ్చేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్ళింది. 

ఈ సమయంలో అదే బస్తీకి చెందిన శివ (22) బాలికకు ఏవో మాయమాటలు చెప్పి..  సమీపంలోని మరో బస్తీలో ఉండే కార్మికుడిగా పనిచేస్తున్న మిత్రుడు స్థాయి (20) గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఉదయం నాలుగు గంటలకు వారినుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్ళి తల్లికి విషయం చెప్పింది. ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో, అత్యాచారం, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు