ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులను మిద్దె మీదికి తీసుకెళ్లి.. కీచకుడి వికృతం.. అరెస్ట్..

Published : Sep 15, 2021, 11:00 AM IST
ఇంటిముందు ఆడుకుంటున్న  చిన్నారులను మిద్దె మీదికి తీసుకెళ్లి.. కీచకుడి వికృతం.. అరెస్ట్..

సారాంశం

చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఒక కామాంధుడు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇందిరమ్మ కాలనీలో నిన్న రాత్రి (మంగళవారం) ఇద్దరు చిన్నారులు ఇంటిబయట ఆడుకుంటున్నారు.  ఈ క్రమంలో అనిల్ కుమార్ (21) అనే కీచకుడి కళ్ళు వారిపై పడ్డాయి. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసును మరవకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకునేది. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. 

చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఒక కామాంధుడు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇందిరమ్మ కాలనీలో నిన్న రాత్రి (మంగళవారం) ఇద్దరు చిన్నారులు ఇంటిబయట ఆడుకుంటున్నారు.  ఈ క్రమంలో అనిల్ కుమార్ (21) అనే కీచకుడి కళ్ళు వారిపై పడ్డాయి. 

దీంతో వారి వద్దకు చేరుకుని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరిని  మిద్దె మీదికి తీసుకెళ్లాడు.  తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.  మరో ఏడేళ్ల బాలికను మీద కూర్చోపెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత 9 ఏళ్ల బాలిక ఏడ్చుకుంటూ వెళ్ళి తన అమ్మమ్మ సావిత్రికి విషయం చెప్పింది. 

టీటీడీ పాలకవర్గం: బోర్డు సభ్యుల జాబితా ఇదీ...

సావిత్రి వెంటనే మిద్దె మీదికి వెళ్లి చూడగా  కీచకుడు తన అసభ్య ప్రవర్తన కొనసాగిస్తున్నాడు.  కాగా,  వెంటనే సావిత్రి దిశయాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నిమిషాల్లో  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీచకుడు అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఆలస్యంగా వచ్చి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్