అనుమానం: భార్యను చంపి శవాన్ని పొలంలో పాతిపెట్టిన భర్త

Published : Jun 30, 2020, 09:25 AM ISTUpdated : Jun 30, 2020, 09:26 AM IST
అనుమానం: భార్యను చంపి శవాన్ని పొలంలో పాతిపెట్టిన భర్త

సారాంశం

అనుమానం పెనుభూతమైంది. ఓ వ్యక్తి అనుమానంతో భార్యను చంపి శవాన్ని పొలంలో పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సోమవారం జరిగింది.

కర్నూలు: అనుమానం పెనుభూతమైంది. ఓ వ్యక్తి గర్భిణి అయిన భార్యను చంపి శవాన్ని పొలంలో పాతిపెట్టాడు. ఈ సంఘటన కర్నూలు జిల్ాలలోని హొళగుంద మండలం సమ్మతగేరి మజరా గ్రామం ముగుమానుగుందిలో సోమవారం జరిగింది.

ముగుమానుగుంది గ్రామానికి చెందన బసవరాజుకు అస్పరి మండలం కైరుప్ల గ్రామానికి చెందిన వీణ అలియాస్ మీనాక్షి (28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల భార్యపై బసవరాజుకు అనుమానం ప్రారంభమైంది. దాంతో భార్యను వేధిస్తూ వస్తున్నాడు. కాగా, జూన్ 2వ తేదీన భార్య మీనాక్షి కనిపించుకుండా పోయింది. ఈ విషయం తెలిసి ఆమె పుట్టింటివారు బసవరాజుతో మాట్లాడడానికి ప్రయత్నించారు. 

2వ తేదీననే మీనాక్షి కైరుప్పలకు బయలుదేరిందని బసవరాజు 17వ తేదీన చెప్పాడు. దాంతో మీనాక్షి తండ్రి బీరప్ప తన కుతూరు కనిపించడం లేదని పోలీసు స్టేషన్ లో బసవరాజుపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బసవరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అతను తన నేరాన్ని అంగీకరించాడు.

భార్యను హత్య చేసి శవాన్ని పొలంలో పాతిపెట్టానని బసవరాజు అంగీకరించాడు. శవాన్ని వెలికి తీసి అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెకు ఐదేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బసవరాజును పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్