జైలు నుంచి అలా బయటకు వచ్చిన కాసేపటికే...

By telugu news teamFirst Published Jun 30, 2020, 9:05 AM IST
Highlights

అనంతపురానికి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్సీకి ఫోన్ చేసి తాను ఇండస్ట్రీస్ డిప్యూటీ సెక్రెటరీనని బాలాజీ నాయుడు పరిచయం చేసుకున్నాడు.

వారిద్దరూ నేరం చేసి జైలుకు వెళ్లారు. కానీ.. జైలులో శిక్ష అనుభవించినా వారిలో మార్పు రాలేదు. బయటకు వచ్చిన అరగంటకే.. మళ్లీ నేరాలు చేయడం మొదలుపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ నాయుడు(42), రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన మల్లిడి తాతారెడ్డి(33) ప్రభుత్వ పథకాల కింద రుణాలు ఇప్పిస్తామని పలువురి మోసం చేశారు.

ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. కాగా.. వీరు విశాఖ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా.. విడుదలైన అరగంటకే మళ్లీ నేరాలు చేయడం మొదలుపెట్టడం గమనార్హం. అనంతపురానికి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్సీకి ఫోన్ చేసి తాను ఇండస్ట్రీస్ డిప్యూటీ సెక్రెటరీనని బాలాజీ నాయుడు పరిచయం చేసుకున్నాడు.

రూ.50లక్షలు రుణం మంజూరు చేయిస్తామని.. మార్జిన్ మనీగా రూ.1.25లక్షలు జమ చేస్తే వెంటనే లోన్ వస్తుందని నమ్మించాడు. అది నమ్మిన ఎమ్మెల్సీ అనుచరులు ఆ డబ్బు కట్టేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఏడుగురు ఎమ్మెల్సీ అనచరులకు మొత్తం రూ.8.25లక్షల మొత్తాన్ని బాలాజీ నాయుడు చెప్పిన ఖాతాలో ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే.. రుణం రాకపోవడంతో మోసపోయినట్లు ఎమ్మెల్సీ, అతని అనుచరులు ఆలస్యంగా తెలుసుకన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. నిందుతులు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు. 

click me!