వదినతో వివాహేతర సంబంధం.. సీసా ముక్కతో మర్మాంగాన్ని కోసి, తాయత్తు దారంతో గొంతు బిగించి...

Published : Mar 25, 2022, 12:55 PM IST
వదినతో వివాహేతర సంబంధం.. సీసా ముక్కతో మర్మాంగాన్ని కోసి, తాయత్తు దారంతో గొంతు బిగించి...

సారాంశం

వదినతో వివాహేతర సంబంధం చివరికి అతని ప్రాణాల మీదికి తెచ్చింది. వద్దన్నా వినకుండా వెంటపడి వేధించడంతో స్వయానా అన్నే అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.

అనంతపురం :  ఈ నెల 9న నార్పల మండలం నాయన పల్లిలో చోటుచేసుకున్న అట్టే నారాయణస్వామి murderలో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ  విజయ భాస్కర్ రెడ్డి,  ఎస్సై వెంకట ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీర నారప్ప గౌడ్, నారాయణ స్వామి అన్నదమ్ములు. అన్న వీర నారప్ప  భార్య పద్మావతితో నారాయణస్వామి extramarital affair కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న  అన్న హెచ్చరికతో పద్మావతిలో మార్పు వచ్చింది.

అయితే తన కోరిక తీర్చాలంటూ నారాయణస్వామి వేధిస్తుండడంతో ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో తమ్ముడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 9న రాత్రి 9 గంటలకు తన పొలంలోని చింతచెట్టు వద్దకు నారాయణస్వామిని రప్పించుకున్నారు. పద్మావతితో మాట్లాడుతుండగా అప్పటికే  మాటువేసి ఉన్న అన్న వీర నారప్పతో పాటు పెద్ద నాన్న  కుమారుడు పెద్ద వీర నారప్ప దాడి చేశారు.

కిందపడిన మరిది చేతులను పద్మావతి, కాళ్లను పెద్ద వీర నారప్ప పట్టుకోగా.. నారాయణస్వామి  బీజాలపై  అన్న బలంగా తన్ని సీసా ముక్కతో మర్మాంగాన్ని కోశాడు. తర్వాత మెడలోని తాయత్తు దారం తీసి  నారాయణస్వామి గొంతు బిగించి హతమార్చాడు.  కేసు దర్యాప్తులో భాగంగా  బుధవారం సాయంత్రం అనుమానంతో వీర నారప్ప  అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అసలు విషయం తెలిసింది.  దీంతో అట్టే వీర నారప్ప, పెద్ద వీర నారప్పను  గురువారం అరెస్టు చేసి,  న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా, పెళ్లై ఎనిమిది నెలలు అయింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు. పెళ్లయిన కొద్ది రోజుల వరకు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పెళ్ళికి కట్నకానుకల కింద రూ. 45 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజుల నుంచి extra dowry తీసుకుని రావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. husbandతోపాటు అత్తమామలు వేధిస్తుండడంతో భరించలేక ఓ married woman బలవన్మరణానికి పాల్పడింది.  ఈ ఘటన చింతకొమ్మదిన్నె మండలంలోని బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై మంజునాథ రెడ్డి వివరాల మేరకు..  సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరుకు చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి  కుమార్తె గుగ్గుళ్ల నవిత (25)  ఎంబీఏ వరకు చదువుకుంది.

2021 ఆగస్టులో సికె దిన్నె మండల పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గుగ్గుళ్ల బాబారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. బాబారెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. నవిత ఓ కంపెనీలో పనిచేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్తతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు.  వేధింపులు తట్టుకోలేక గురువారం నవిత చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడింది. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పుట్టింటివారు ఆస్పత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. సీకే దీన్నే  తహసిల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు.. నవిత తండ్రి లక్ష్మీ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం