ఏపీ శాసనమండలిలో తాళి బొట్లతో నిరసన: ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్సీల సస్పెన్షన్

By narsimha lode  |  First Published Mar 25, 2022, 12:01 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుండి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు శుక్రవారం నాడు సస్పెండ్ అయ్యారు. తాళిబొట్లతో టీడీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.


అమరావతి: Andhra Pradesh శాసనమండలి నుండి తాళిబొట్లతో నిరసనకు దిగిన ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్సీలను చైర్మెన్ మోషేన్ రాజు శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ Legislative Council  సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇవాళ TDP  సభ్యులు నిరసనకు దిగారు.  

ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీలతో మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని మంగళసూత్రాలను మండలిలో ప్రదర్శిస్తూ టీడీపీ MLCలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల తీరును చైర్మెన్  Koyye Moshenu Raju తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి రోజూ ఏదో ఒక రకమైన పద్దతిలో నిరసన వ్యక్తం చేయడాన్ని చైర్మెన్ రాజు తప్పు బట్టారు. సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని  టీడీపీ ఎమ్మెల్సీలపై చైర్మెన్ మండిపడ్డారు.

Latest Videos

ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్సీలను చైర్మెన్ సస్పెండ్ చేయడంతో మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఏపీ శాసనమండలిలో నిరసనకు దిగారు. తమ డిమాండ్ కు ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి నుండి వాకౌట్ చేశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మండలిలోనూ, అసెంబ్లీలోనూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. జంగారెడ్డిగూడెం మరణలపై టీడీపీ సభ్యులు రెండు సభల్లో పట్టు బడుతున్నారు. శాసనసభలో, మండలిలో కూడా ఇదే రకమైన డిమాండ్లతో వాయిదా తీర్మానాలు, చర్చ కోసం  టీడీపీ ఆందోళనలు చేస్తుంది.

తమ డిమాండ్ల మేరకు చర్చకు అనుమతివ్వని కారణంగా చిడతలు కూడా  వాయించామని టీడీపీ సభ్యులు మీడియాకు తెలిపారు. అంతేకాదు సభలో తమ  డిమాండ్ విషయమై సభను అలెర్ట్ చేసేందుకు శాసనసభలో విజిల్ వేసినట్టుగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించిన విషయం తెలిసిందే.మరో వైపు శాసనసమండలిలో కూడా నిన్న టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ చిడతలు వాయించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై  చైర్మెన్ మండిపడ్డారు. సభ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

click me!