బెదిరించి పలుమార్లు లైంగికదాడి.. పదో తరగతి బాలిక ప్రసవం...

Published : Mar 25, 2022, 12:13 PM IST
బెదిరించి పలుమార్లు లైంగికదాడి.. పదో తరగతి బాలిక ప్రసవం...

సారాంశం

తనకేం జరుగుతుందో తెలియకుండానే ఓ చిన్నారి గర్భం దాల్చింది. కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్ల దగ్గరికి వెడితే.. డెలివరీ చేశారు. కరెంట్ పనికోసం వచ్చిన కామాంధుడు చేసిన అఘాయిత్యానికి ఓ చిన్నారి గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది.   

రొంపిచర్ల :  యువకుడి బెదిరింపులకు భయపడి పలుమార్లు Sexual assaultని ఎదుర్కొన్న ఓ బాలిక చివరకు pregnant అయ్యి.. బిడ్డకు జన్మనిచ్చింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి బంధువుల కథనం ప్రకారం… మండల కేంద్రంలోని ఓ private schoolలో చదువుకుంటూ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని బంధువుల ఇంట్లో ఉంటుంది. ఓ సారి ఇంటికి Current repair లు చేయడానికి వచ్చిన పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లెకు చెందిన రాజేష్(34) బాలిక మీద కన్నేశాడు. అప్పటికే అతడికి పెళ్లయ్యింది. ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. అప్పటినుంచి బాలిక కదలికలను గమనించడం మొదలు పెట్టాడు. ఓరోజు ఒంటరిగా వెడుతున్న బాలిక వెంటపడి బలవంతంగా తీసుకెళ్లి molestation చేశాడు.

ఆ సమయంలో సెల్ ఫోన్ వీడియో తీశాడు.  ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తానని బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడు.  ఇంట్లో చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరికీ చెప్పలేదు.  కడుపులో ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడింది.  కడుపు నొప్పి తీవ్రం కావడంతో పది రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు.  కడుపు నొప్పి తీవ్రం కావడంతో తల్లిదండ్రులు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడ బాలిక గర్భం దాచిన సంగతి బయటపడింది.  గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని,  నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని రొంపిచర్ల ఎస్ ఐ  వెంకటేశ్వర్లు తెలిపారు.  నవజాత శిశువు ఆరోగ్యం సాధారణంగా ఉందని చెప్పారు. 

ఇదిలా ఉండగా, చంపుతానని బెదిరించి తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడిన కీచక ఉపాధ్యాయుడిపై khammam ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదయ్యింది.  సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..  మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గూడెం పాఠశాలలో బాణోతు కిశోర్ teacherగా పని చేస్తున్నాడు. ఆయన ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్నాడు.  ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఖమ్మంలో నివసించే వారు ఇద్దరూ కారులో పాఠశాలకు వెళ్ళి వస్తుంటారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివసించే ఓ ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో,  అక్కడినుంచి ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి వస్తూ ఉంటుంది.  ఈనెల 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహిస్తున్నారు.

17న ఇంటికి తిరిగి వచ్చేందుకు రైల్వేస్టేషన్లో వేచి ఉన్న సదరు మహిళా ఉపాధ్యాయురాలిని తన భార్య కూడా వస్తుందని నమ్మించి కారు ఎక్కించుకున్నాడు సదరు ఉపాధ్యాయుడు. ఆ తరువాత ఆమెను చంపుతానని బెదిరించి సెల్ఫోన్ లాక్కున్నాడు. మార్గమధ్యలో  పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెబితే ఆమె భర్తను, పిల్లలను చంపుతానని బెదిరించాడు. దీంతో విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే  తీవ్రంగా మదన పడిన ఆమె మంగళవారం తన భర్తకు విషయం తెలిపింది. వెంటనే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు కిశోర్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu