వివాహేతర సంబంధం ... ప్రియురాలిని చంపి ఆమె కూతురికే ఫోన్ చేసిన నిందితుడు

Published : May 12, 2023, 12:14 PM IST
వివాహేతర సంబంధం ... ప్రియురాలిని చంపి ఆమె కూతురికే ఫోన్ చేసిన నిందితుడు

సారాంశం

వివాహేతర సంబంధాన్ని కొనసాగిన్న మహిళను అతి దారుణంగా హతమార్చాడు ఓ దుండగుడు. 

కర్నూల్ :వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళపైనే ఒకడు అనుమానాన్ని పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు. మహిళ గొంతుకు చున్నీ బిగించి అతి దారుణంగా చంపేసాడు. అనంతరం మృతురాలి కూతురికే ఫోన్ చేసి చెప్పాడు సదరు నిందితుడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నెల్లూరుకు చెందిన సుధారాణి(45) భర్తతో గొడవల కారణంగా గత మూడేళ్లుగా దూరంగా వుంటోంది. కర్నూల్ లోని  రాఘవేంద్రనగర్ కాలనీలో ఒంటరిగా నివాసముంటోంది. ఈ కాలనీ సమీపంలోనే నివాసముండే ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డితో ఈమెకు పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకేదగ్గర వుంటూ సహజీవనం చేస్తున్నారు. 

అయితే ఇటీవల సంధ్యారాణి ప్రవర్తనలో మార్చు రావడంతో శ్రీనివాస్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. తరచూ బయటకు వెళుతున్న ఆమె ఒక్కోసారి రాత్రుళ్లు బయటే వుంటోంది. దీంతో కొంతకాలంగా సంధ్యారాణితో ప్రియుడు శ్రీనివాస్ రెడ్డి గొడవపడుతున్నాడు. ఇలా నిన్న(గురువారం) కూడా వీరిమధ్య గొడవ జరగగా కోపంతో ఊగిపోయిన శ్రీనివాస్ రెడ్డి సంధ్యారాణిని చంపేసాడు. చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం మృతురాలి కూతురికే ఫోన్ చేసి నీ తల్లిని చంపేసినట్లు చెప్పాడు. 

Read More  అర్థరాత్రి ప్రియుడి ఇంటికివెళ్లి.. కత్తిపీటతో నరికిన ప్రియురాలు..

సంధ్యారాణి కూతురు ఫిర్యాదుతో రాఘవేంద్ర నగర్ కాలనీలోని ఇంటికి వెళ్లి మృతదేహాన్న పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు... పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!