నంద్యాలలో దారుణం: భార్యను చంపేందుకు బ్లేడ్ తో ఆసుపత్రికి, పెనుగులాటలో తెగిన భర్త గొంతు

Published : Jan 01, 2023, 02:13 PM ISTUpdated : Jan 01, 2023, 02:23 PM IST
నంద్యాలలో దారుణం: భార్యను చంపేందుకు బ్లేడ్ తో ఆసుపత్రికి, పెనుగులాటలో  తెగిన  భర్త గొంతు

సారాంశం

నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో  భార్యాభర్తల మధ్య గొడవ  ప్రాణాలకు మీదకు  తెచ్చింది.  ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న భార్యను చంపేందుకు  వచ్చిన భర్తతో భార్య గొడవపడింది.ఈ పెనుగులాటలో  భర్త గొంతు తెగింది.

కర్నూల్: నంద్యాల జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వాసుపత్రిలో  ఆదివారం నాడు  భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది.  ఈ ఘర్షణలో  భర్త గొంతుకు బ్లేడ్ గాయాలయ్యాయి.దీంతో  ఆయన   ఆరోగ్య పరిస్థితి విషమంగా  మారింది.నంద్యాల జిల్లాకు చెందిన  బ్రహ్మయ్య అనే వ్యక్తి  పది రోజుల క్రితం తన భార్య లక్ష్మీదేవి గొంతు కోశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న బ్రహ్మయ్య ఆమెను చంపాలనే ఉద్దేశ్యంతో  గొంతు కోశాడు. ఈ ఘటనలో  తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి  నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.  అయితే  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీదేవిని చంపేందుకు బ్రహ్మయ్య ఇవాళ  బ్లేడ్ తో  నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో  ఉన్న భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య లక్ష్మీదేవి బ్రహ్యయ్యను నిలువరించింది. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఈ  క్రమంలో బ్రహ్మయ్య  గొంతుకు బ్లేడు గాయాలయ్యాయి. బ్రహ్మయ్యకు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించారు.

నంద్యాల జిల్లాలోని కానానపల్లెకు చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరిద్దరి వివాహలు జరిగాయి.  గతంలో బ్రహ్మయ్య  విద్యుత్ శాఖలో పనిచేసేవాడు. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో బ్రహ్మయ్య కుడి చేయిని కోల్పోయాడు.దీంతో  బ్రహ్మయ్య భార్య లక్ష్మీదేవి  కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.  లక్ష్మీదేవిపై బ్రహ్మయ్య అనుమానం పెంచుకున్నాడు. పది రోజుల క్రితం  లక్ష్మీదేవి గొంతు కోశాడు. ఈ ఘటనలో  గాయపడిన లక్ష్మీదేవి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.ఆసుపత్రిలో చంపేందుకు వచ్చిన బ్రహ్మయ్య  భార్య  చేతిలో గాయపడ్డాడు.   ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu
ముద్రగడ గొడవ తర్వాత : Nara Lokesh Reaction | Bonda Uma | Asianet News Telugu