కారణమిదీ: శ్రీకాకుళంలో తొడకొట్టిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

By narsimha lodeFirst Published Jan 1, 2023, 11:39 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో  జగనే సీెం అవుతారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  తొడకొట్టి మరీ చెప్పారు. ఇవాళ బూర్జలో నిర్వహించిన   వలంటీర్ల సమావేశంలో  తమ్మినేని సీతారాం తొడకొట్టారు. 

శ్రీకాకుళం: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  ఆదివారంనాడు తొడకొట్టారు ఏపీలో  మరోసారి వైఎస్ జగన్  సీఎం అవుతారని  ఆయన  ఆశాభావం  వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలోని  బూర్జలో  నిర్వహించిన  వలంటీర్ల సమావేశంలో  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తొడకొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  మరోసారి వైసీపీ విజయం సాధిస్తారని  మహిళలే భరోసా ఇస్తున్నారన్నారు.సంక్షేమ కార్యక్రమాలతో  వెళ్తున్న  జగన్  పై  ప్రజల్లో  విశ్వాసం వెల్లి విరుస్తుందని  ఆయన  ఆశాభావం వ్యక్తం  చేశారు. 

2024 లో  ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది.  వైసీపీని గద్దె దించాలని  విపక్షాలు ప్రయత్నాలను ప్రారంభించాయి.  ఈ విషయమై  అధికార, విపక్షాల మధ్య  మాటల యుద్ధం  సాగుతుంది.  వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు కూటమిగా  ఏర్పడి  పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అయితే  ఏఏ పార్టీల మధ్య  పొత్తు ఉంటుందనే  విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.  మరో వైపు  వైసీపీ  మాత్రం గత ఎన్నికల మాదిరిగానే ఒంటరిగానే బరిలోకి దిగనుంది.  ఈ విషయాన్ని ఆ పార్టీ స్పష్టం  చేసిన విషయం తెలిసిందే. 

వచ్చే ఎన్నికల్లో  వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే . టీడీపీకి ప్రయోజనం కలిగించే విధంగా  జనసేన  చీప్ పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తుంది.చంద్రబాబు డైరెక్షన్ లో  పవన్ కళ్యాణ్  పనిచేస్తున్నారని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  వైసీపీ నేతల విమర్శలకు జనసేన ధీటుగా సమాధానం చెబుతున్నారు.

 ఇదిలా ఉంటే  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  రాష్ట్రంలోని  175 అసెబ్లీ స్థానాల్లో  విజయం సాధించాలనే  లక్ష్యంతో వైసీపీ ముందుకు వెళ్తుంది. ఈ మేరకు పార్టీ ప్రజా ప్రతినిదులకు  సీఎం జగన్ దిశానిర్ధేశం  చేస్తున్నారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న  కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయమై  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ప్రజల నుండి  తెలుసుకోవాలని సీఎం సూచించారు . ప్రభుత్వం నుండి ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారనే విషయమై  కూడా  పీడ్ బ్యాక్ అందించాలని  కోరారు. అయితే  ఈ కార్యక్రమంలో  కొందరు ప్రజా ప్రతినిధులు సరిగా  పాల్గొనకపోవడంపై  సీఎం జగన్ అసంతృప్తిని వ్యక్తం  చేశారు. ఈ ఏడాది మార్చి మాసంలో  మరోసారి  గడప డపడకు మన ప్రభుత్వం కార్యక్రమంపై  వర్క్ షాప్  నిర్వహించనున్నారు.
 

click me!