ఫోన్ నెంబర్ ఇవ్వలేదని... యువతి ఇంటిముందు తుపాకీతో కాల్పులు

Arun Kumar P   | Asianet News
Published : Jun 19, 2021, 12:12 PM ISTUpdated : Jun 19, 2021, 12:19 PM IST
ఫోన్ నెంబర్ ఇవ్వలేదని... యువతి ఇంటిముందు తుపాకీతో కాల్పులు

సారాంశం

గన్ తో హల్ చల్ చేసి గ్రామస్తులందరిని భయబ్రాంతులకు గురిచేసిన యువకున్ని చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

చిత్తూరు: ప్రేమ పేరిట యువతిని వేధించడమే కాదు ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదని ఆమె ఇంటివద్ద గన్ తో హల్ చల్ చేశాడు ఓ యువకుడు. ఇలా కాల్పులకు తెగబడి యువతి కుటుంబసభ్యులనే కాదు గ్రామస్తులందరిని భయబ్రాంతులకు గురిచేసిన యువకున్ని చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా కడపనత్తం గ్రామానికి చెందిన యువకుడు చాను పక్కింట్లో వుండే యువతిని ప్రేమపేరిట వేధించేవాడు. ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. అందుకు అంగీకరించని యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపింది. దీంతో వారు చాను ఇంటికి వెళ్లి అతడి కుటుంబం ఎదుటే హెచ్చరించారు.

read more  బెజవాడ పోలీసులకు చిక్కిన కిల్లర్స్ గ్యాంగ్: వెలుగులోకి విస్తుపోయే విషయాలు 

దీంతో కోపంతో రగిలిపోయిన చాను గురువారం రాత్రి నాటు తుపాకీతో యువతి ఇంటిపైకి వెళ్లాడు. యువతి తల్లిదండ్రులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాల్పులు జరిపాడు. అయితే తూటాలు ఎవరికీ తగలకపోవవడంతో ప్రమాదం తప్పింది. 

గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకున్ని అరెస్ట్ చేశారు. అతడి వద్దనుండి నాటు తుపాకీ, తూటాలను స్వాదీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు