తుప్పుగాడు చంద్రబాబు, పప్పుగాడు లోకేష్: కొడాలి నాని తిట్లదండకం

By telugu teamFirst Published Jun 19, 2021, 11:33 AM IST
Highlights

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద ఏపీ మంత్రి కొడాలి నాని తిట్ల దండకం ఎత్తుకున్నారు. తుప్పుగాడు, పప్పుగాడు అంటూ ఆయన దూషించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తిట్లదండకం ఎత్తుకున్నారు. చంద్రబాబును తుప్పుగాడిగా, నారా లోకేష్ ను పప్పుగాడిగా అభివర్ణించారు. పప్పుగాడు లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. 

ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని తుప్పుగాడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారని, నెల రోజుల్లో చెల్లింపులు జరపాలని అడిగారని, పిచ్చికాగితం మీద నాలుగు మాటలు రాశాడని ఆయన అన్నారు. కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాాడరు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. 

మనిషివా, దున్నపోతువా అని కూడా చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు చంద్రబాబు బకాయిలు పెట్టిపోతే తాము చెల్లించామని ఆయన చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్ ఇంటికి పరిమితమై కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ధాన్యం కొనుగోళ్లకు 21 రోజుల లోపల డబ్బులు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఇవ్వకపోయినా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. 

ధాన్యానికి, నూకకు నారా లోకేష్ కు తేడా తెలియదని ఆయన అన్నారు. నారా లోకేష్ ను మహిళలు వ్యతిరేకించేవారేనని, మాస్కు పెట్టుకోవడంతో గుర్తు పట్టలేదని ఆయన అన్నారు. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలువలేకపోయారని, దాంతో ఆయనకు ఇంట్లో తిండి పెట్టడం లేదనిపిస్తోందని, దాంతో బరువు తగ్గాడని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

click me!