మైనర్ బాలికకు మాయమాటలు .. అత్యాచారం చేసి వీడియో చిత్రీకరణ, బాధితురాలి తండ్రిని బ్లాక్‌మెయిల్

Siva Kodati |  
Published : Jul 18, 2021, 04:46 PM IST
మైనర్ బాలికకు మాయమాటలు .. అత్యాచారం చేసి వీడియో చిత్రీకరణ, బాధితురాలి తండ్రిని బ్లాక్‌మెయిల్

సారాంశం

ప్రేమ పేరుతో మైనర్ బాలికను ట్రాప్ చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా న్యూడ్ వీడియోస్ తీసి బెదిరింపులకు పాల్పడిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 

మైనర్ బాలికను ప్రేమ పేరిట నమ్మించి అత్యాచారం చేయడమే గాకుండా బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన యువకుడిన గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సౌత్ డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. వేములపల్లి జోష్ బాబు అనే యువకుడు మైనర్ బాలికను ట్రాప్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా న్యూడ్ వీడియోస్ తీశాడని పేర్కొన్నారు. 

వాటి సాయంతో బాలికను, ఆమె తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని.. దాదాపు మూడు లక్షల ముప్పైవేలు, రెండు బంగారు చెయిన్ లు తీసుకున్నాడని డీఎస్పీ వెల్లడించారు. ఆ బాలిక అక్కతో ప్రేమాయణం నడిపి ఆమెను వివాహం చేసుకున్నాడని.. ఆ తర్వాతే ఆ బాలిక మొత్తం వ్యవహరాన్ని తల్లిదండ్రులకు చెప్పినట్లు వెల్లడించారు. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేశామన్నారు. అపరిచితులతో మాట్లాడకూడదని.. ఇటువంటి ఘటనలు జరినప్పుడు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ ప్రశాంతి సూచించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?