కన్న తండ్రే కాలయముడు: నెల్లూరులో వీడిన కవలల హత్య మిస్టరీ

Published : Jul 18, 2021, 02:39 PM IST
కన్న తండ్రే కాలయముడు: నెల్లూరులో వీడిన కవలల హత్య  మిస్టరీ

సారాంశం

భార్యపై అనుమానంతో ఓ భర్త తన పిల్లలను చంపాడు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం రాజోలు పాడుకు చెందిన వెంకటరమణయ్య తన కవలలను హత్య చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.


నెల్లూరు: కవలల పిల్లల హత్య కేసును పోలీసులు చేధించారు. కన్న తండ్రే పిల్లలను హత్యచేసినట్టుగా పోలీసులు తేల్చారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.జిల్లాలోని మనుబోలు మండలం  రాజోలుపాడులో  గత నెల 20న ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై పోలీసలుు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. 

కన్న తండ్రే పిల్లలకు విషమిచ్చి చంపారని గుర్తించారు.  వివాహమైన కొద్ది నెలలకే భార్యతో వెంకటరమణయ్యకు విబేూధాలు వచ్చాయి. ఈ విబేధాల నేపథ్యంలో భార్యకు బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో కన్న పిల్లలకు విషమిచ్చారు.  పాలల్లో విషమిచ్చి  పిల్లలకు ఇచ్చాడని  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  నిందితుడు వెంకటరమణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.భార్యపై ఉన్న అనుమానంతో పిల్లలకు విషమిచ్చినట్టుగా నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.అభం శుభం తెలియని చిన్నారులకు విషమిచ్చి చంపింది తండ్రేనని తెలియడంతో స్థానికులు  కూడ ఆశ్చర్యపోయారు. నిందితుడు వెంకటరమణను కఠినంగా శిక్షించాలని  కోరుతున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?