పశ్చిమ గోదావరిలో విషాదం: విద్యుత్ షాక్ తో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

By narsimha lode  |  First Published May 17, 2022, 3:24 PM IST


పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి మండలం రామచంద్రాపురంలో మంగళవారం నాడు విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.



ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా Pedavegiమండలం Ramachandrapuram లో మంగళవారం నాడు విషాదం చోటు చేసుకొంది. లారీలోకి కొబ్బరి పీచును లోడు చేస్తున్న సమయంంలో తొమ్మిది మందికి electric shockతగిలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

కొబ్బరి పీచును Lorryలో లోడు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగలింది. దీంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో 9 మందికి కూడా విద్యుత్ షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనలో Ashok అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Latest Videos

undefined

 అజాగ్రత్త, నిర్లక్ష్యంతో పాటు ప్రమాదవశాత్తు విద్యుత్ సాక్ కు గురై రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణాలు సంభవించిన ఘటనలు లేకపోలేదు.ఈ ఏడాది జనవరి 31న గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు బండిపై సెల్పీ దిగుతూ విద్యుత్ షాక్ కు గురైన కటకం వీరభద్రుడు మరణించాడు. సెల్పీ దిగుతూ వీరభద్రుడు గాయపడ్డారు. వెంటనే అతడిని Guntur ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరభద్రుడు  మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్గం తర్వాత వీరభద్రుడి మృతదేహన్ని   కుటుంబ సభ్యులకు అప్పగించారు.  వీరభద్రుడి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం గ్రామం.

2021 జనవరి 30వ తేదీన  ఆర్టీసీ బస్సుకు విద్యుత్  షాక్ తగిలి ఒకరు మృతి చెందారు.  ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.కల్వకుర్తి నుండి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ వాటిల్లింది.  ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణీకులున్నారు.

కల్వకుర్తి నుండి అచ్చంపేటకు వెళ్తున్న సమయంలో  బస్సుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో  బస్సులో కూర్చొన్న 50 ఏళ్ల నర్సమ్మ అనే మహిళ విద్యుత్ షాక్ తో మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

2021 ఫిబ్రవరి 23న విద్యుత్ షాక్ తో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో విద్యుత్ షాక్ తో  తల్లీ, కొడుకు సజీవ దహనమయ్యారు. .బైక్‌పై తల్లీ కొడుకు  వెళ్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో ఇద్దరు కూడ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

బైక్ పై వెంకటస్వామి ఆయన తల్లి వెంకటలక్ష్మి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 11 కేవీ విద్యుత్ లైన్లు ట్రిప్ అయి తెగి కిందపడ్డాయి.ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించలేదు.

aslo read:వాటర్ హీటర్ ఉన్న బకెట్లో చేయి పెట్టి.. చిన్నారి మృతి..

ఈ విషయం తెలియని వెంకటస్వామి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ వైర్ తగిలి షాక్ కు గురయ్యారు. వెంటనే వారికి మంటలు అంటుకొని సజీవదహనమయ్యారు.స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు మరణించారు. 
 

click me!