పోలవరంపై ఇవాళ న్యూఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాలల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరో వైపు సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందం ఈ నెలలోనే ప్రాజెక్టును పరిశీలించనుంది.
న్యూఢిల్లీ: Polavaram ప్రాజెక్టుపై మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు న్యూఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి కేంద్ర జల్ శక్తి ప్రధాన సలహాదారులు Vedire Sriram ఆధ్వర్యంలో భేటీ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ పై చర్చించనున్నారు.
ఈ భేటీకి ఏపీ రాష్ట్రానికి చెందిన జల వనరుల శాఖాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రాజెక్టుకు నిధులు మంజూరు విషయమై రేపు జల్ శక్తి కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరగనుంది. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందం సందర్శించనుంది.
ఈ ఏడాది మార్చి 11న పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తైంది. ప్రాజెక్టు స్పిల్ వేలో 48 రేడియల్ గేట్లను అమర్చారు. 2001 డిసెంబర్ 17న రేడియల్ గేట్ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి.
గత సీజన్ లో వర్షా కాలంలో ప్రాజెక్టుకు వరదలు వచ్చే సమయానికి 42 రేడియల్ గేట్లను అమర్చి నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన ఆరు రేడియల్ గేట్లను ఇవాళ అమర్చారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు.
త్వరలోనే మిగిలిన ఆరు గేట్లకు కూడా 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తైతే గేట్ల ఆపరేటింగ్ చేయవచ్చు. ఇప్పటికే గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల అమర్చారు. స్పిల్ వే లో 3,32,114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. స్పిల్ వేలో కీలకమైన షిఫ్ ల్యాండర్ నిర్మాణం సైతం పూర్తి చేసిన విషయం తెలిసిందే.,
ఈ ఏడాది మార్చి మాసంలోనే కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఏపీ సీఎం వైఎస్ జగన్ లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.55,548.87 కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్ర మంత్రిని కోరారు. తాగునీటి కాంపొనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని విజ్ఞప్తిచేశారు
ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కాంపొనెంట్ వారీగా రీయింబర్స్ చేస్తోందని, కాంపొనెంట్ వారీగా నియంత్రణల వల్ల కొన్ని పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి ముందు ముఖ్యమంత్రి ఉంచారు.
దీనివల్ల పోలవరం, కుడి-ఎడమ కాల్వలకు సంబంధించిన పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని సీఎం చెప్పారు. ఏకంగా చేసిన పనులకు బిల్లులు కూడా పీపీఏ అప్‌లోడ్ చేయడంలేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు
దీనివల్ల రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చుకు, కేంద్ర ప్రభుత్వం చేసిన రీయింబర్స్‌మెంట్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందన్న సీఎం గుర్తు చేశారు.
వివిధ పనుల కోసం ఖర్చుచేసిన రూ.859.59 కోట్ల రూపాయల బిల్లులను పీపీఏ నిరాకరించిన విషయాన్ని సీఎం, రాష్ట్ర అధికారులు.. కేంద్రమంత్రికి వివరించారు.
మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఒకే కాంపొనెంట్‌గా తీసుకుని, ప్రతి 15 రోజుల కొకసారి బిల్లులను చెల్లించాలని ఏపీ సీఎం కోరారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ ఫ్లో ఉంటుందని సీఎం వివరించారు.
also read:పోలవరం ప్రాజెక్ట్ కు గండి... 144 సెక్షన్ అందుకోసమేనా?: టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల
దిగువ Copper డ్యాం, ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో వరదల కారణంగా ఏర్పడ్డ కోతకు గురైన ప్రాంతాన్ని ఏ విధంగా పూడ్చాలన్న దానిపై ఇప్పటివరకూ విధానాలను, డిజైన్లను ఖరారు చేయలేదని కేంద్రమంత్రికి రాష్ట్ర అధికారులు తెలిపారుప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని సీఎం కోరారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని సీఎం కోరారు. దీనివల్ల పనుల నిర్మాణ పరిశీలన ఎప్పటికప్పుడు జరుగుతుందన్నారు. అలాగే సమన్వయ లోపం లేకుండా, పరిపాలన సులభంగా జరిగేందుకు వీలు ఉంటుందని తెలిపారు.