కరోనాతో సత్తెనపల్లిలో వ్యక్తి మృతి: రోడ్డుపైనే డెడ్‌బాడీ

By narsimha lodeFirst Published Jul 19, 2020, 5:28 PM IST
Highlights

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 25 వార్డు వావిలాల వీధిలో కరోనాతో ఒ వ్యక్తి రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో  రోడ్డుపైనే  డెడ్ బాడీ ఉంది. దీంతో స్థానికులు  ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.


గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 25 వార్డు వావిలాల వీధిలో కరోనాతో ఒ వ్యక్తి రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో  రోడ్డుపైనే  డెడ్ బాడీ ఉంది. దీంతో స్థానికులు  ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

also read:యువనేత బర్త్‌డే వేడుకలు: రావులపాలెంలో 25 మందికి కరోనా

ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతగా ఉన్నాడు. దీంతో ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాడు.  ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో ఆయనను క్వారంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే ఆయనను క్వారంటైన్ తరలించేందుకు అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అంబులెన్స్ రాలేదు. ఆటోలో క్వారంటైన్ సెంటర్ వద్దకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించాడు. కానీ ఆటో ఎక్కలేకపోయాడు.దీంతో ఆటో డ్రైవర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

also read:కరోనా భయం: కిడ్నీ రోగిని చేర్చుకోని ప్రైవేట్ ఆసుపత్రి, మెట్లవద్దే మృతి

అంబులెన్స్ కోసం ఎదురుచూస్తుండగానే రోడ్డుపైనే ఆయన కుప్పకూలిపోయాడు. రోడ్డుపైనే మరణించాడు. కరోనా భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ముందుకు రాలేదు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ వాహనంలో డెడ్ బాడీని తీసుకురావాలని 108 సిబ్బంది చెప్పినట్టుగా స్థానికులు చెప్పారు.

మృతుడికి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. రోడ్డుపైనే రెండు గంటలుగా డెడ్ బాడీ ఉంది. ఈ విషయాన్ని వలంటీర్ తో పాటు అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.రోడ్డుపైనే డెడ్ బాడీ ఉండడంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడ్డారు.


 

click me!