చిత్తూరులో ఏనుగుల బీభత్సం... పలమనేరులో ఓ ఇంటిపై గుంపుగా దాడి, ఒకరు మృతి

Arun Kumar P   | Asianet News
Published : May 25, 2022, 12:28 PM IST
చిత్తూరులో ఏనుగుల బీభత్సం... పలమనేరులో ఓ ఇంటిపై గుంపుగా దాడి, ఒకరు మృతి

సారాంశం

చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ ఇంటిపై ఏనుగుల గుంపు దాడిచేయడంతో నిద్రిస్తున్న వ్యక్తం మృతిచెందాడు. 

పలమనేరు: చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు భీభత్సం సృష్టించాయి. పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంద్రానగర్ గ్రామ శివారులోని పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడిచేసి నాశనం చేసాయి. ఈ క్రమంలోనే పొలం వద్దే ఇటిని నిర్మించుకుని జీవిస్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసి చంపేసాయి. 

చిత్తూరు జిల్లాలో తరచూ జనావాసాల్లోకి వచ్చి ఏనుగులు అలజడి సృష్టించే ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కూడా పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ పరిధిలోని పొలాల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఇలా ముందుకు కదులుతూ ఈ ఏనుగుల గుంపు ఇంద్రానగర్ గ్రామ శివారులో పొలంవద్ద గల ఓ ఇంటిపై పడింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న యానాది సుబ్రమణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ  ఘటనతో ఇంద్రానగర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల దాడుల్లో పంటలే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

ఇదిలావుంటే ఇటీవల ఇదే చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడ ఓ రైతు మృతిచెందాడు. సదుం జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో సంచరించే ఏనుగులు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లి సమీపంలోని పంట పొలాలపై పడుతున్నాయి. ఇలా ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో రైతు ఎల్లప్ప అనే రైతు కాపలా కోసం పొలానికి వెళ్లారు.  రాత్రి పంట పొలాల్లో నిద్రిస్తున్న రైతు ఎల్లప్పపై ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుంండా పోయింది. అతడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.  

అంతకుముందు ఏనుగుల గుంపును తరముతున్న వ్యక్తిపై దాడిచేసి చంపేసిన ఘటన ఇదే చిత్తూరులో చోటుచేసుకుంది.  చిత్తూరు జిల్లాలో 14 ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నాయి. వాటిని తమిళనాడులోకి తరమడానికి అ అధికారి ప్రయత్నించాయి. కానీ, ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి ఏనులు ఆగ్రహించాయి. వాటిని తరముతున్న వ్యక్తిపై దాడి చేశాయి. 

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లె గ్రామానికి చెందిన వాడిగతా చిన్నబ్బ అటవీ శాఖలో ట్రాకర్ సహాయకుడిగా పని చేసేవాడు. అధికారుల ఆదేశాలతో అతడుచిత్తూరులో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్క నిమిషంలో ఏనుగులు ఎందుకు ఉగ్రరూపం దాల్చాయో తెలియదు గానీ  చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నబ్బ మరణించాడు.  

మరోవైపు కొద్దిరోజులుగా తిరుమలలో ఏనుగుల మంద కలకలం సృష్టిస్తుంది. తిరుమల పాపవినాశనం రహదారి వెంటక ఏనుగులు సంచరిస్తున్నాయి.  ఆకాశగంగ ప్రాంతంలో రోడ్డు మీదకు వచ్చిన ఏనుగుల మంద.. వాహనదారులను కూడా వెంబడించాయి. ఏనుగుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఏనుగులు తిరుమల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 


 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే